కాంగ్రెస్ ను వదులుతున్నారు..సోదాలు చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ను వదులుతున్నారు..సోదాలు చేశారు

కాంగ్రెస్ ను వదులుతున్నారు..సోదాలు చేశారు

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013

ప్రకాశం జిల్లాలో గ్రానైట్ క్వారీలలో విజిలెన్స్ దాడులు జరిగాయి.మామూలుగా అయితే ఇందులో పెద్ద ఆశ్చర్యం ఉండదు.కాని ఇవి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, దర్శి ఎమ్మెల్యే బి.శివప్రసాదరెడ్డిలకు చెందినవి కావడం విశేషం. వీరిద్దరు కాంగ్రెస్ నుంచి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి వెళతారన్న వార్తలు వచ్చిన కొద్దిరోజులకు జరగడంతో సహజంగానే దీనికి ప్రాదాన్యత వస్తుంది.కాంగ్రెస్ లో ఉంటారనుకున్నపుడు క్వారీల జోలికి రాని అధికారులు , ఇప్పుడు వారు కాంగ్రెస్ కు దూరం అవుతారనగానే దాడులు చేసినట్లు కనిపించడం మరీ పచ్చిగా ఉంది. రాజకీయాలు ఇంతగా దిగజారకూడదు. సరిగ్గా జగన్ కేసులో కాంగ్రెస్ పార్టీ సిబిఐని ప్రయోగించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పార్టీ మారతారనుకున్న ఎమ్మెల్యేల క్వారీలపై దాడులు చేశారన్న భావన కలగడం మంచిది కాదు.అన్ని క్వారీలపై తనిఖీలు చేసి ,పద్దతిగా వ్యవహరించడంలో తప్పు లేదు కాని, మరీ ఇంత బహిరంగంగా కనపడేలా చేస్తే అదికారాన్ని దుర్వినియోగం చేసినట్లు అవుతుందేమో.

http://kommineni.info/articles/dailyarticles/content_20130116_27.php
Share this article :

0 comments: