వైసీపీలో చేరదాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైసీపీలో చేరదాం

వైసీపీలో చేరదాం

Written By news on Monday, March 3, 2014 | 3/03/2014

వైసీపీలో చేరదాం
 నరసాపురం
 ‘సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే తొలినుంచీ నిజారుుతీగా పాలుపంచుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడ్డారు. ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని కలిశారు. తెలుగుజాతి పౌరుషాన్ని నిలబెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ.. అటు తెలుగుదేశం పార్టీ రోజుకో మాట చెప్పారుు. ద్వంద్వ విధానాలతో పనిచేశారుు. చివరకు రాష్ట్ర విభజనకు సహకారం అందించారుు. ఈ పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనవసరం. టీడీపీలో చేరడం దండగ. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరదాం’ అని నరసాపురం నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్పారు.
మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడిపై ఒత్తిడి తెచ్చారు. నరసాపురంలోని విద్యు త్ శాఖ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థారుు కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కొత్తపల్లి రాజీనామా చేసిన విషయం విదితమే. అనంతరం ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తపల్లి ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్త­ృతస్థారుు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలతోపాటు సర్పంచ్‌లు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కులసంఘ నాయకులు పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న విషయమై కొత్తపల్లి కార్యకర్తల అభిప్రాయూలు అడిగారు.
దీనికి స్పందిస్తూ రాష్ర్ట విభజన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో పనిచేసిందని కార్యకర్తలు ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఢిల్లీ పెద్దలను ఎదిరించి తెలుగుజాతి పౌరుషాన్ని చాటిచెప్పిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, రెండు నాలుకల ధోరణితో పనిచేసిన టీడీపీ, విభజనకు మద్దతు పలికిన బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.
 
 కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం
 కార్యకర్తల అభీష్టం మేరకు వైఎస్సార్ సీపీలో చేరడానికి కొత్తపల్లి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సమావేశం ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. రాష్ర్టం కలిసే ఉండాలన్న లక్ష్యంతో పోరాడిన పార్టీలోకి వెళ్లాలనే యోచనలో తాను ఉన్నట్టు తెలిపారు. అతిగా ఆలోచన చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, లక్ష్య సాధన కోసం దూసుకుపోయే వ్యక్తికి అండగా నిలబడటం మంచిదని పరోక్షంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల రాష్ర్టం రెండుగా చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రా6ష్ట విభజన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే సీమాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో బాలుడి నుంచి వృద్ధుల వరకూ భాగస్వాములయ్యారని, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సంఘాలు చారిత్రక పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: