బాపట్ల నియోజకవర్గంలో ముగిసినయాత్ర 26 కిలోమీటర్ల పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాపట్ల నియోజకవర్గంలో ముగిసినయాత్ర 26 కిలోమీటర్ల పర్యటన

బాపట్ల నియోజకవర్గంలో ముగిసినయాత్ర 26 కిలోమీటర్ల పర్యటన

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011

రెండోవిడత 11వరోజు 12 వైఎస్సార్ విగ్రహాల ఆవిష్కరణ
బాపట్ల నియోజకవర్గంలో ముగిసినయాత్ర
26 కిలోమీటర్ల పర్యటన 

గుండెల్లో ఉన్న మహానేతను ప్రజలు విగ్రహాల రూపంలో పల్లెపల్లెనా కొలువుదీరుస్తున్నారు. తమ జీవితాల్లో వెలుగునింపిన ఆయనను ప్రతీ గ్రామంలో నిలువెత్తు ప్రతిరూపంలా నిలుపుతున్నారు. నిజంగా వారికెంత 
అభిమానమంటే.. గ్రామానికి రెండుమూడేసి చొప్పున కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటిని తరచిచూస్తే ‘నమస్తే అక్కా.. నమస్తే అన్నా..’ అంటూ చిరునవ్వుతో పలకరిస్తున్నట్లే ఉంటున్నాయి. నేనెక్కడకీ వెళ్లలేదు.. మీ మనసుల్లో ఉన్నాను చూడండి అని గుర్తుచేస్తుంటాయి. నిజమే మహానేత దూరమై చీకటైతే కమ్మింది కానీ.. కాంతి మాత్రం దూరమవలేదు. జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో వెలుగురేఖలా వస్తోంది. ఆశ కొత్తపొద్దులా పొడుస్తోంది.

బాపట్ల టౌన్, న్యూస్‌లైన్
కంకటపాలెంలో శనివారం ఉదయం 9.45 గంటలకు స్థానికులు షేక్ ఇస్మాయిల్ నివాసం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రకు బయలుదేరారు. మార్గం మధ్యలో ఎస్సీకాలనీ ప్రజలు ఆయనను కలిసి ఇళ్లస్థలాలు ఇప్పించాల్సిందిగా కోరారు. త్వరలోనే అందరి కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చి ముందుకు కదిలారు. వెదుళ్ళపల్లి చేరుకున్న జగన్‌కు అఖండస్వాగతం లభించింది. గ్రామ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అదే గ్రామంలో జాతీయరహదారి సమీపంలో మరో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి స్టువార్టుపురం చేరుకున్న జగన్‌కు గ్రామశివారులో చిన్నారులు పార్టీ జెండాలు చేతబూని ఘనస్వాగతం పలికారు. గ్రామానికి చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానికుడు పాకల రాజేష్ జగన్‌కు విల్లంబులు బహూకరించగా.. జగన్ విల్లు ఎక్కుపెట్టారు. గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

బేతపూడిలో..: అనంతరం బేతపూడి చేరుకున్న జగన్‌కు కిలోమీటర్ల పొడవున పూలతివాచీలు పరిచి, బాణసంచా పేల్చి, కనకతప్పెట్లతో ఘనస్వాగతం పలికారు. ఆర్‌సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్ పాల్గొన్నారు. గ్రామంలోని వేపచెట్టు సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత పార్టీ నేత కోట చినమీరారెడ్డి నివాసంలో అల్పాహారవిందుకు హాజరయ్యారు. గ్రామ లైబ్రరీ సెంటర్‌కు చేరుకుని మరో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముగ్గురు చిన్నారులకు నామకరణం చేశారు. అనంతరం బేతపూడి రైలుపేటలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాపట్ల మండల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చెట్టుపల్లి కమల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం గ్రామంలోని మరో చర్చిలో ప్రార్థనలు చేసి పోలేరమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

వెదుళ్ళపల్లిలో..: అనంతరం వెదుళ్ళపల్లి కొత్తపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులుస్వాగతం పలికారు. రచ్చబండ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి మురుకొండపాడు చేరుకుని గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కంకటపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. కంకటపాలెం ఎస్సీకాలనీకి చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని అవిష్కరించారు. అక్కడి చర్చిలో ప్రత్యేకప్రార్థనల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అక్కడినుంచి నర్సాయపాలెం చేరుకున్నారు.గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ నాయకులు కళ్ళం వెంకటేశ్వరరెడ్డి నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. జమ్ములపాలెం చేరుకున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యప్పపీఠం వద్ద భజన చేస్తున్న దీక్షాపరులు జగన్‌ను ఆహ్వానించగా.. జగన్ ప్రత్యేకపూజలో పాల్గొన్నారు. గ్రామంలో మరో విగ్రహాన్ని అవిష్కరించారు. మరో సెంటర్‌లో ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చెరువు ఉప్పరపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో స్థానికుడు బోడపాటి సుబ్బారావు నివాసానికి రాత్రి బసకు చేరుకున్నారు. 

ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరు..: మాజీమంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన విగ్రహావిష్కరణ, సభా కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష, మేరిగ విజయలక్ష్మి, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ నేతలు కోన రఘుపతి, దొంతిరెడ్డి మురళీగోవిందరెడ్డి(నాని), సలగల రాజశేఖర్, మోదుగుల బసవపున్నారెడ్డి, దొంతిరెడ్డి జగదీష్‌కుమార్‌రెడ్డి, పులుగు మధుసూదన్‌రెడ్డి తదితరులున్నారు.
Share this article :

0 comments: