వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం

Written By news on Thursday, December 1, 2011 | 12/01/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర గురువారం గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

వివరాలు..

1-12-2011 గురువారం

వట్టిచెరుకూరు మండలం
* ముట్లూరు నుంచి యాత్ర ప్రారంభం
* కోవెలమూడిలో వైఎస్ విగ్రహావిష్కరణ
* కారంపూడిపాడులో విగ్రహావిష్కరణ

చేబ్రోలు మండలం
* చేబ్రోలులో పర్యటన
* మంచాలలో విగ్రహావిష్కరణ పొన్నూరు మండలం
* బ్రాహ్మణకోడూరులో రెండు విగ్రహాల ఆవిష్కరణ
* గోళ్ళమూడిపాడులో విగ్రహావిష్కరణ
* మునిపల్లెలో విగ్రహావిష్కరణ
* పచ్చలతాడిపర్రులో విగ్రహావిష్కరణ
* దండమూడిలో విగ్రహావిష్కరణ

రేపు పొన్నూరులో జగన్ బహిరంగసభ



పొన్నూరు(చేబ్రోలు), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి చేపట్టిన ఓదార్పుయాత్ర గురువారం పొన్నూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ డాక్టర్ ఎన్.రూత్‌రాణినివాసంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణకోడూరులో మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణతో పొన్నూరు నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం సాయంత్రం పొన్నూరు సెంటర్‌లో బహిరంగసభ జరుగుతుందని తెలిపారు. ఓదార్పుయాత్రను విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని నాయకులందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు.

రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలో ఓదార్పు ముగిసేలా ప్రణాళిక తయారుచేసినట్లు పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారమే యాత్ర సాగుతుందని స్పష్టం చేశారు. షెడ్యూల్‌లో లేని గ్రామాలకు చెందిన వారు సహకరించాలని కోరారు. జగన్ తమ గ్రామానికి రావాలని కాన్వాయ్‌ని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ కృష్ణా జిల్లా పరిశీలకుడు రావి వెంకటరమణ, నియోజకవర్గ నాయకులు షేక్ యాసిన్, దాసరి నారాయణరావు, ఎస్‌ఎం బాషా, డాక్టర్ ఎన్.రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ ఎన్.రూత్‌రాణి, గేరా సుబ్బయ్య, జాఫర్, సైయిఫుల్లా, రుద్రపాటి బాబు, హైమారావు, జాకీర్‌హుస్సేన్, అప్పయ్య, శివరామకృష్ణ, రుద్రపాటి శేషు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: