ఉప ఎన్నికలలో సత్తాచాటేందుకు సిద్ధం: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికలలో సత్తాచాటేందుకు సిద్ధం: జగన్

ఉప ఎన్నికలలో సత్తాచాటేందుకు సిద్ధం: జగన్

Written By news on Thursday, December 1, 2011 | 12/01/2011


గుంటూరు: దమ్ముంటే తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని, ఉప ఎన్నికలకు తాము సిద్దమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సవాల్ విసిరారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెట్టేది రైతుల కోసం కాదని, తన వర్గం ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకేనన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తనతో ఉన్న ప్రతి ఎమ్మెల్యే దానికి మద్దతు తెలుపుతారని చెప్పారు. 

ఉప ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పెద్దలకు తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కేంద్రంలో సోనియా గాంధీ రాజ్యమేలుతుందంటే అది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పుణ్యమేనన్నారు.
 
 
కుమ్మక్కులో భాగమే అవిశ్వాసం: జగన్


గుంటూరు: అవిశ్వాస తీర్మానం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల కుమ్మక్కులో భాగమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా ముట్లూరులో మాట్లాడుతూ.. అవిశ్వాస తీర్మానం పేరుతో తన వెంట ఉన్న ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు నాటకమాడుతున్నారు అని జగన్ అన్నారు. రైతుల కోసం ఎలాంటి పరీక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. 
 
 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ వర్గం ఓటు'




ఒంగోలు: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎటువంటి జిమ్మిక్కులు లేకుండా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు అన్నారు. అంతకంటే ముందు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్న పార్టీలతో చంద్రబాబు చర్చించాలని ఆయన అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆయన చెప్పారు. జగన్ వర్గం నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా ఏమీకాదన్నారు. జగన్ నాయకత్వంలో పని చేస్తున్నందుకు గర్విస్తున్నానని చెప్పారు. విశ్వసనీయత కలిగిన నేతకాబట్టే జనం అంతా జగన్ వెంట నడుస్తున్నారన్నారు.
Share this article :

0 comments: