ఓదార్పుయాత్ర సోమవారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్పుయాత్ర సోమవారం

ఓదార్పుయాత్ర సోమవారం

Written By news on Monday, November 28, 2011 | 11/28/2011

జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు నుంచి ప్రారంభ మవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. 

వివరాలు..

28-11-2011 సోమవారం

పెదనందిపాడు మండలం
* నాగులపాడు నుంచి యాత్ర ప్రారంభం 
* కట్రపాడులో వైఎస్ విగ్రహావిష్కరణ

కాకుమాను మండలం
* కొమ్మూరులో విగ్రహావిష్కరణ
* పెద్దివారిపాలెంలో విగ్రహావిష్కరణ

పెదనందిపాడు మండలం
* ఉప్పలపాడులో విగ్రహావిష్కరణ
* అన్నవరంలో విగ్రహావిష్కరణ
* తాళ్లపర్రులో రెండు విగ్రహాల ఆవిష్కరణ * పెదనందిపాడులో విగ్రహావిష్కరణ, బహిరంగసభ, కొమ్మినేని శివశాంతి కుటుంబానికి ఓదార్పు




మాట ఇవ్వడం కాదు.. నిలబెట్టుకోవడమే గొప్ప.. ఈ క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించడమే గొప్పతనం. ఆ లక్షణాలున్నవారే నిజమైన నాయకులు. వారికే ప్రజాదరణ. తన తండ్రి మరణంతో తల్లడిల్లి పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలను పలకరిస్తానని, వారిని ఓదారుస్తానని.. చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన దీక్షాదక్షుడు. ఇది సర్వత్రా వినిపిస్తున్న మాట. అందుకే విశ్వసనీయతకు మారుపేరైన జననేత వెంట జనం నడుస్తున్నారు. అండగా నిలుస్తున్నారు.

కాకుమాను, న్యూస్‌లైన్ : ప్రత్తిపాడు నియోజకవర్గంలోని అప్పాపురంలో ఆదివారం ఉదయం 9.50 గంటలకు బోడపాటి సుబ్బారావు నివాసం నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మలివిడత.. 12వ రోజు ఓదార్పుయాత్రను ప్రారంభించారు. తొలుత అప్పాపురం ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆష్కరించారు. అక్కడినుంచి లూథరన్ చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రేటూరులో జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. చెరువుకట్ట వద్ద నాగలి చేతపట్టుకుని ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని జననేత ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం ఎస్టీకాలనీలో పర్యటించిన జగన్‌కు ప్రజలు సమస్యల ఏకరువు పెట్టారు. తెలగాయపాలెం పయనమైన జగన్‌ను మార్గం మధ్యలో చినకాకుమాను గ్రామస్తులు ఆపి తమ గ్రామానికి రావాలని కోరారు.

వారి కోరిక మేరకు జగన్ ఆ గ్రామంలో పర్యటించి లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అక్కడినుంచి పెద్దపాలెం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు షెడ్యూల్‌లో లేనప్పటికీ పొన్నూరు మండలం పెదపాలెంలో పర్యటించి అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి తెలగాయపాలెం చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామసెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, రామాలయంలో పూజలు చేశారు. పార్టీ నేత బండ్ల ఆంజనేయలు ఇంట్లో జరిగిన అల్పాహార విందుకు హాజరయ్యారు. 

తర్వాత బండ్లవారిపాలేనికి చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామంలోని అక్కి వీరయ్యస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొమ్మూరు కాలువ వంతెనమీదుగా గరికపాడు చేరుకున్న జగన్‌కు పూలతివాచీలు పరిచి స్వాగతించారు. ఆ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామం లోని మరో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రత్యేకంగా తయారుచేసిన స్వీట్ తినిపించారు. తర్వాత గ్రామంలోని కోదండ రామాలయంలో పూజలు నిర్వహించారు. 

బి.కె.పాలెంలో.. 
అనంతరం బి.కె.పాలెం చేరుకున్న జననేత అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కాకుమాను చేరుకున్న జగన్‌కు మండల కేంద్రంలో ప్రజలు అపూర్వస్వాగతం పలి కారు. గ్రామంలోని ఆరుమళ్ళ రామారావు ఇంటి డాబాపై ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత కాలనీలో మరో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కొండపాటూరు చేరుకున్న జగన్ గ్రామంలో రెండు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఆ గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరుగుపయనమై పెదనందిపాడు మండలంలోని నాగులపాడులోన బండి శివరావు నివాసంలో రాత్రి బసచేశారు. 

ఎమ్మెల్యేల హాజరు.. 
ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఓదార్పుయాత్రలో పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ, సభా కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మాకినేని పెదరత్తయ్య, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మేల్యే రావి వెంకటరమణ, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, పొన్నూరు నేతలు మారుపూడి లీలాధర్‌రావు, రూత్‌రాణి, దాసరి నారాయణరావు, యాసిన్, ప్రత్తిపాడు నియోజకవర్గ నేతలు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, సింగమనేని రమేష్, చుండూరు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: