జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

రెండు చేతులతో నమస్కరించడం ఆయన సంస్కారం. ‘చేతులారా’ పలకరించిన ప్రతీ ఒక్కరికీ ప్రతిగా అభివాదం చేయడం ఆయన మంచితనం. తనకంటే చిన్నవారి తలపై చెయ్యిఉంచి దీవించడం ఆయన పెద్దరికం. వృద్ధులను రెండుచేతులా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని పలకరించడం గౌరవభావం. జగన్ పలకరింపు అచ్చు ఆ మహానేతలాగే ఉంటుందని, ప్రజలపై ఆయనకున్న ప్రేమను గుర్తు చేస్తుందని ఇప్పుడు పల్లెపల్లెనా వినిపిస్తున్న మాట. అందుకే నడుస్తున్నారు జననేత వెంట.. 

పెదనందిపాడు, న్యూస్‌లైన్ : నాగులపాడు గ్రామంలోని బండి శివరావు నివాసం నుంచి సోమవారం ఉదయం 9.30 గంటలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్రకు పయనమయ్యారు. తొలుత గ్రామసెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని పూలమాలలువేసి నివాళులర్పించారు. అక్కడ విద్యార్థులతో కరచాలనం చేసి ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఎదురైన పత్తి రైతులతో మాట్లాడారు. అక్కడినుంచి కొమ్మూరు సెంటర్‌కు చేరుకున్న జననేతకు ముస్లింలు సంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు. కొమ్మూరు సెంటర్‌మీదుగా కాట్రపాడు చేరుకుని చర్చిసెంటర్‌లో స్థానికులు ఏర్పాటుచేసిన ఎడ్లబండిలో కొంతదూరం వెళ్లారు.

అనంతరం పార్టీ జెండాను, తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రా ఇవాంజికల్ చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడ ఓ చిన్నారికి నామకరణం చేశారు. అనంతరం కోదండ రామాలయం చేరుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి కొమ్మూరు చేరుకున్న జగన్ పత్తిరైతులతో మాట్లాడి పంట పరిస్థితి, దిగుబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పత్తి ధర పతనమై తాము పడుతున్న ఇబ్బందులను రైతులు ఏకరువు పెట్టారు. అక్కడినుంచి వెళ్లి గ్రామ సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

పూలేకు నివాళి..
జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కొమ్మూరు బీసీ కాలనీలో పార్టీ నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి నేతృత్వంలో నగరనేత మద్దుల రాజాయాదవ్ ఏర్పాటు చేసిన జ్యోతిరావుపూలే సంస్మరణ సభలో జగన్ పాల్గొన్నారు. పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. ఎస్సీకాలనీకి చేరుకున్న జగన్‌కు మహిళలు తమ సమస్యలను విన్నవించారు. అనంతరం పెద్దివారిపాలెం చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. అక్కడినుంచి కొమ్మూరు చేరుకుని చర్చిలో ప్రార్థనలు చేశారు. 

అనంతరం ముస్లిం కాలనీలో పార్టీజెండాను ఆవిష్కరించారు. తర్వాత పాలపర్రుకు పయనమైన జగన్‌ను మార్గం మధ్యలో మహిళారైతులు, కూలీలు కలిసి మాట్లాడారు. వారి సమస్యలను జగన్ ఆలకించారు. అనంతరం ఉప్పలపాడు చేరుకుని గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత పౌలు లూథరన్ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడినుంచి పయనమైన జగన్‌కు మార్గం మధ్యలో ఎత్తిపోతల పథకం కింద పంట సాగుచేస్తున్న రైతులు శివన్నారాయణ, మారుబోయిన అంజి తదితరులు కలిసి సాగు కష్టాలను వివరించి ఆదుకోవాలంటూ కోరారు. త్వరలో మీ అందరి కష్టాలు తీరుతాయంటూ జగన్ భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి అన్నవరం చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఎడ్లబండి ఎక్కి..
గ్రామంలోని రెండు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. అన్నవరం గ్రామ అడ్డరోడ్డు వద్ద పరిటాలవారిపాలెం గ్రామస్తులు జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడినుంచి పాలపర్రుకు చేరుకున్న జగన్ గ్రామ శివారు నుంచి ఎడ్లబండిని తోలారు. స్థానికులు జంపని సంజీవ నివాసంలో అల్పాహార విందుకు హాజరయ్యారు. ఆ గ్రామంలో రెండు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పెదనందిపాడు చేరుకున్న జగన్‌కు గ్రామస్తులు బాణసంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. గ్రామసెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ ఉద్వేగంగా ప్రసంగించారు. అనంతరం వైఎస్సార్ మరణం తట్టుకోలేక మృతిచెందిన కొమ్మినేని శివశాంతి కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం అక్కడినుంచి గ్రామంలోని పర్వతనేని నాగేశ్వరరావు నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం నాగులపాడు గ్రామానికి చేరుకుని అరవపల్లి కృష్ణమూర్తి నివాసంలో రాత్రి బస చేశారు. 

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు 
ఓదార్పుయాత్రలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత యాత్రలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డిలు జగన్‌ను కలిశారు. సభా కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ అధ్యక్షత వహించారు. జిల్లా ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు మాకినేని పెదరత్తయ్య, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ నాయకులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి, కట్టా సాంబయ్య, ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, దాసరి శ్రీనివాసరావు, నసీర్ ఆహ్మద్, మందపాటి శేషగిరిరావు, పలువురు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: