పంట కోయడానికి భయపడుతున్న రైతు: జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పంట కోయడానికి భయపడుతున్న రైతు: జగన్

పంట కోయడానికి భయపడుతున్న రైతు: జగన్

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011




పంట కోయడానికి ప్రస్తుతం రైతు భయపడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఓదార్పు యాత్రలో భాగంగా రేటూరు గ్రామం వచ్చిన జగన్ కు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంట చేతికొచ్చేసమయంలో 700 రూపాయల ధర చూసి రైతులు విలవిలలాడుతున్నరన్నారు. రెండు బస్తాలు అమ్మితేగానీ ఒక బస్తా డిఎపి కొనలేని పరిస్థితి ఉందని చెప్పారు. సినిమా టిక్కెట్లు బ్లాక్ లో అమ్మినట్లు ఎరువులను బ్లాక్ లో అమ్మడం బాధాకరం అన్నారు. 

ప్రభుత్వంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. నైతిక విలువలు కోల్పోయి చనిపోయిన వ్యక్తిపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

దేశం మొత్తంలో పెన్షన్ కింద 4వేల కోట్ల రూపాయలు ఇవ్వగా, ఒక్క మన రాష్ట్రంలోనే దివంగత వైఎస్ హయాంలో రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్ గా ఇచ్చారని తెలిపారు.ప్రస్తుతం ఉన్న నేతలలో ఏ ఒక్కరికి కూడా చనిపోయిన తరువాత ప్రజలలో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న తపనలేదన్నారు.

కాకుమాను మండలం అప్పాపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఓదార్పుయాత్ర ప్రారంభమైంది. గ్రామంలో అభిమానులు ఏర్పాటు చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఇదిలా ఉండగా, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ ఉదయం అప్పాపురం వచ్చి జగన్ ని కలిశారు. 

గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం పెద్దపాలెం చేరుకున్నారు. అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. తెలగాయపాలెం చర్చిలో జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 

గుంటూరు: జిల్లాలో ఓదార్పు యాత్రలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని మాజీ మంత్రి నాగిరెడ్డి ఈరోజు కలిశారు. జగన్ తెలగాయపాలెంలో ఉండగా నాగిరెడ్డి వెళ్లి కలిశారు. 
Share this article :

0 comments: