పాపం... రామోజీ సిగ్గుపడుతున్నారు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాపం... రామోజీ సిగ్గుపడుతున్నారు!

పాపం... రామోజీ సిగ్గుపడుతున్నారు!

Written By news on Monday, November 28, 2011 | 11/28/2011

‘సాక్షి దరువు... డెలాయిట్ చిందు’ అంటూ ‘ఈనాడు’లో పెడబొబ్బలు
గత 10, 11 తేదీల్లో రాసిన పాత కథనాలనే పతాక శీర్షికగా కలిపి కొట్టిన వైనం
తమపై విచారణ వార్తేమో లోపలి పేజీలకు..!
రూ.100 షేరును రూ.5,28,830 చొప్పున కంపానీకి కట్టబెట్టిన ఘనుడు రామోజీ
రూ.1,800 కోట్ల నష్టాలున్నా... ‘ఈనాడు’ విలువ రూ.7,000 కోట్లుగా నిర్ధారింపు
దొంగే ‘దొంగా’ అన్నట్టుగా సాక్షి వాల్యుయేషన్‌పై గొంతు చించుకుంటున్న రామోజీ
ససాక్ష్యంగా ‘ఏది నిజం’ సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ బదులివ్వ(లే)ని రాజగురువు


పాపం... రామోజీ సిగ్గుపడుతున్నారు!

చంద్రబాబుతో పాటు తనమీద కూడా సీబీఐ, ఈడీ, డీఐజీ, హోం శాఖల దర్యాప్తు ప్రారంభమైన అంశాన్ని కప్పిపెట్టేందుకు రామోజీ నిన్నటి సంచిక ‘ఈనాడు’లో ఏం చేశారంటే...

జగన్ సంస్థలో ప్రీమియం ఎక్కువగా నిర్ణయించారంటూ ఓ పాచి కథనాన్ని పతాక శీర్షిక చేసుకున్నారు. అదీ ఆయనకు తెలిసిన జర్నలిజం.
రామోజీరావు, ఉషోదయా పబ్లికేషన్స్‌లతోపాటు మరో పది మంది మీద సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమయింది. ఇది మొన్నటి పరిణామం కాబట్టి, నిన్నటి పత్రికల్లో రావాలి. పాపం రామోజీకి తనకు సంబంధించిన ఇలాంటి వార్తలు తన పత్రికలో ప్రముఖంగా ప్రచురించడం జర్నలిజంలో భాగం అనిపించదు. ఉన్నది ఉన్నట్టు రాయటానికి ఆయనకు ఎక్కడా లేని నామోషీ. తన పత్రిక మొదటి పేజీలో ఈ విషయం ప్రచురించటానికి మొహం చెల్లలేదు. ఎక్కడో పన్నెండో పేజీలో ‘చంద్రబాబుపై సీబీఐ ప్రాథమిక విచారణ’ అని ఎవరికీ కనపడీ కనపడకుండా ఒక సింగిల్ కాలమ్ వార్తతో సరిపెట్టారు. చంద్రబాబు మీద సీబీఐ విచారణ ప్రారంభమైతే మరి రామోజీ సుప్రీంకోర్టు, హైకోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నట్టు అన్న అనుమానం తన పాఠకులకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదన్నది ఆయన అంధ విశ్వాసం. తన వ్యవహారాన్ని కప్పిపెట్టుకున్న రామోజీ నిన్నటి ఈనాడు మొదటి పేజీలో ‘‘సాక్షి దరువు.. డెలాయిట్ చిందు’’ అంటూ ఓ వార్తా కథనాన్ని తన నగ్న రూపానికి పత్రికా పరదాగా వాడుకున్నారు. అదెలాగో చూడండి...

సాక్షి పత్రికా సంస్థ విలువ ఎంత ఉండవచ్చు అన్న అంచనాలను ఈ పత్రిక యాజమాన్యం పత్రిక బయటకు రావటానికి ముందు రెండు సంస్థలకు అప్పగించింది. అందులో ఒకటి జగదీశన్ అండ్ కంపెనీ. మరొకటి డెలాయిట్ టచ్ తోమత్సు. మొదటి సంస్థ 2007 జూలైలో, రెండో సంస్థ 2007 నవంబరులో తమ అంచనాలతో నివేదికను జగతి పబ్లికేషన్స్(సాక్షి)కి సమర్పించాయి. వీటిలో రెండో సంస్థ తన నివేదికను ముందు తేదీతో ఇచ్చినట్టు డెలాయిట్ ప్రతినిధి సుదర్శన్ సీబీఐకి వెల్లడించారన్నది ఈనాడు ఈ నెల 10,11 తేదీల్లో ప్రచురించిన వార్తా కథనాల సారాంశం. పాడిందే పాటరా... అన్న సామెతగా, అవే వార్తా కథనాలను కలిపి కొట్టి రామోజీ మీద కూడా సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభమవుతుందన్న వార్తను ఈనాడు తన కాగితం కింద కప్పెట్టే ప్రయత్నం చేసింది.
డెలాయిట్ కంపెనీ ప్రతినిధిని తన ఎదుట హాజరుపరిచి తేదీల మార్పు విషయంలో నిజానిజాలు నిర్ధారించే అవకాశం ఇవ్వాలంటూ సాక్షి ఆడిటర్ హోదాలో విజయసాయిరెడ్డి ఈ నెల 11న బహిరంగ లేఖలో సవాల్ చేశారు. ఆ సవాల్‌కు డెలాయిట్ సంస్థ స్పందించలేదు. అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న డెలాయిట్ సంస్థ జగతి పబ్లికేషన్స్ ఇచ్చిన సమాచారం ప్రాతిపదికగానే వేల్యుయేషన్‌ను నిర్ధారించిందని... తాము స్వతంత్రంగా ఆ నివేదికలను పరిశీలించనే లేదని... మార్కెట్‌లో విచారణ చేపట్టలేదని... కంపెనీ అందించిన ఆస్తి, అప్పుల పట్టీని కూడా పరిశీలించలేదని... జగతి పబ్లికేషన్స్ వ్యాపార ప్రణాళిక, భవిష్యత్తు అంచనాలకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించలేదని తమతోనో, సీబీఐతోనో డెలాయిట్ ప్రతినిధి పేర్కొన్నారన్నది కథనం. ఇలాంటి కథనం చదివిన తరవాత ఎవరికైనా వచ్చే సందేహాలు అనేకం...

ఊ డెలాయిట్ అయినా మరే సంస్థ అయినా సంబంధిత కంపెనీ నుంచి సమాచారం సేకరించే విలువను నిర్ధారిస్తుంది. మిగతా వ్యక్తులమీద, సంస్థల మీద బురద పూయటమే పనిగా పెట్టుకున్న రామోజీ, తమ ఉషోదయా ఆస్తుల్ని ఎర్నెస్ట్ అండ్ ఎంగ్ ఎలా లెక్క కట్టిందో వివరిస్తే ఆయన ఆస్తుల బండారం, పెట్టుబడుల యవ్వారం బట్టబయలు అవుతుంది. ఊ పెట్టుబడుల ప్రారంభ దశలో డెలాయిట్ నివేదిక అందిందని జగతి పబ్లికేషన్స్ స్పష్టం చేసింది. అంతకుముందే జగదీశన్ అండ్ కో నివేదిక జూలైలో వచ్చిందని కూడా వెల్లడించింది. అంటే డెలాయిట్ అంచనా అన్నది మరో సంస్థ కూడా ఇచ్చిన అంచనాయే తప్ప అది ఏకైక అంచనా కాదు.

ఊ తేదీ మార్చాలనుకుంటే, సాక్షిలో పెట్టుబడులు ప్రారంభమైన తరవాతి తేదీని వేయాలని ఎవరైనా ఎందుకు పట్టుపడతారు? అడిగిన తేదీలను వేసి ఇవ్వటానికి వేల్యుయేషన్ కంపెనీలు సిద్ధపడుతున్నట్టయితే, పెట్టుబడుల ప్రారంభానికి నెల రోజుల ముందో... ఏడాది ముందో తేదీ వేసి నివేదిక ఇవ్వండని వాటిని అడగవచ్చు కదా? 2007 నవంబర్‌కు మునుపే, 2007 జూలైలోనేజగదీశన్ అండ్ కో వేల్యుయేషన్ నివేదిక ఇచ్చిందని చెపుతున్నప్పుడు... జగతి పబ్లికేషన్స్ ప్రీమియం నిర్ధారణలో సక్రమ విధానాన్ని మాత్రమే అనుసరించిందన్నది నిర్ధారణ అవుతోంది కదా?

ఊ అదీకాక... సాక్షి పెట్టుబడులకు సంబంధించి ఈ సంస్థ తరఫున వెలువడిన అనేకానేక వివరణల్లో, అంతకు కొద్ది నెలల ముందే ‘ఈనాడు’కు లభించిన విలువ ఎలా ప్రధాన ప్రాతిపదిక అయిందో పూసగుచ్చినట్టు ఉంది.

ఊ సాక్షి అన్నది కొత్తగా ప్రారంభమైన సంస్థ కాబట్టి దానికి 2007లో నష్టాలన్నవి ఉండవు. కానీ అప్పటికి రామోజీ గ్రూపు చాలా కాలంగా మోసుకుని వస్తున్న నష్టాలు దాదాపు రూ.1,800 కోట్లు. ఇలా దశాబ్దాల తరబడి దేశంలో మరే కంపెనీకీ లేనంతగా కనీవినీ ఎరుగని నష్టాలున్న రామోజీ పత్రికా సంస్థ తన విలువను దాదాపు రూ.7,000 కోట్లుగా నిర్ణయించుకుంది. సాక్షి ఆవిర్భావానికి కొద్ది నెలల ముందు రామోజీ తమ రూ.100 షేరుకు రూ. 5,28,830 ప్రీమియంగా నిర్ణయించి కంపానీకి వాటాలమ్మినట్టు చూపారు. ఇంత భారీ లాభానికి షేరు అమ్మటం మీద ఇటీవలే రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇంతకీ రామోజీ కంపెనీ వేల్యుయేషన్‌కు ప్రాతిపదికలేమిటి? ఆ విషయాన్ని వివరించటానికి రామోజీకి ధైర్యం చాలటం లేదు ఎందుకని?
ఊ మరోవంక, వేల్యుయేషన్ కంపెనీలు జగతి పబ్లికేషన్స్ విలువను అందులో సగం కూడా నిర్ధారించలేదు. అదీగాక జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.10 షేరును కేవలం రూ.350 ప్రీమియంతో పెట్టుబడిదారులకు అమ్మారు.

ఊ డెలాయిట్ నివేదిక అంతర్గతంగా సంస్థ కోసం తయారు చేసినదే అంటూ ‘ఈనాడు’ చేస్తున్న వాదన మరీ విచిత్రం. డెలాయిట్ డిస్‌క్లెయిమర్‌కు సంబంధించిన నిజాలనూ విజయసాయిరెడ్డి తన బహిరంగ లేఖలో ప్రస్తావించారు. ఆ నివేదికలోనే ఏం ఉందంటే... ‘‘ఈ నివేదికను కేవలం జగతి సంస్థ బయటి ఇన్వెస్టర్లతో తమ సంప్రతింపులకు ప్రాతిపదిక కల్పించేందుకే ఇస్తున్నాం. బయటి పార్టీలు, ఔత్సాహిక ఇన్వెస్టర్లు ఈ నివేదికమీద ఆధారపడజాలరు. వారు విధిగా తమకు తాము విచారణ, స్వతంత్ర మదింపు చేసుకోవాలి....’’ అని అందులో స్పష్టంగా ఉంది. డెలాయిట్ నివేదికను ఇన్వెస్టర్లకు ఇచ్చారన్నది నిజం అనుకుంటే, వారికి వారే పెట్టుబడికి సంబంధించి అంచనా వేసుకోవాలని అందులో స్పష్టంగా ఉంది కాబట్టి ఆ నివేదికను చూపి మోసం చేయటమనే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది?

ఊ ఈ అంశాలన్నింటి మీదా సాక్షి ఈ నెల 12న ‘ఏది నిజం’లో సమగ్ర విశ్లేషణ అందించింది. రామోజీ అనే గురివింద తన సంస్థ వేల్యుయేషన్, ప్రీమియం అంశాల మీద నోరెత్తే సాహసం ఏనాడూ చేయరెందుకు? చంద్రబాబు బినామీల అడ్డగోలు దోపిడీ మీద సీబీఐ, ఈడీ, డీఐజీ, హోం శాఖల విచారణ సాగినంత కాలం ఎల్లో సిండికేట్ పత్రికల వైఖరి ఎలా ఉండబోతోందో రామోజీ పత్రిక నిన్నటి సంచికలో పాడిన పాచిపళ్ళ పాట ఓ ఉదాహరణ.

ఊ సాక్షిలో పెట్టుబడులు పెట్టినవారికి ఈ తెలుగు పత్రికారంగంలో 2008 నాటికి పాఠకుల్లో పేరుకున్న అసంతృప్తి, ప్రజలు భిన్న స్వరం వినిపించే కొత్త జనరేషన్ పత్రిక కోసం ఎదురు చూస్తున్నారన్న అంశం బాగా తెలుసు.

ఇంతకీ రామోజీ బాధ సాక్షిలో పెట్టుబడులు పెట్టినవారి గురించా... లేక సాక్షి నిటారుగా నిలబడి తన దాష్టీకాలను బట్టబయలు చేస్తున్నందుకా... ఈనాడులో రాతలు సాక్షికి, జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి దక్కుతున్న ఆదరణను చూసి పెల్లుబుకుతున్న అసూయా ద్వేషాలా లేక నిజాలా అన్న అంశంలో పాఠకులకు, ప్రజలకు తిరుగులేని స్పష్టత ఉంది.
Share this article :

1 comments:

jeevan said...

పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!