ఆదర్శరైతుల్లో కలవరం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆదర్శరైతుల్లో కలవరం

ఆదర్శరైతుల్లో కలవరం

Written By news on Sunday, November 27, 2011 | 11/27/2011

ఆదర్శరైతుల్లో కలవరం మొదలైంది. పనితీరును బట్టి మార్కులు కేటాయించి విధుల్లో కొనసాగించేందుకు వ్యవసాయశాఖ శనివారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ ప్రకారం నివేదికలు తయారు చేస్తే ప్రస్తుతం ఉన్న ఆదర్శరైతుల్లో మూడో వంతు మందికి ఉద్యోగాలు ఉండవని ఆందోళన చెందుతున్నారు. కొత్త మార్గదర్శకాల్లో ప్రభుత్వం పది అంశాలను ప్రస్తావించింది. ఆదర్శరైతు.. రైతులకు, అధికారులకు మధ్య సంధానకర్తగా ఉంటూ రైతులకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉండాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా మసలుకుంటున్న వారిని తొలగించనున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఇందుకోసం మూడు కేటగిరీల్లో పనితీరును అంచనా వేయనుంది. సొంతూరులోనే ఉంటూ, వ్యవసాయం చేస్తూ, సమావేశాలకు విధిగా హాజరవుతూ, రైతులకు అందుబాటులో ఉంటూ వంటి పది విషయాలను క్రోడీకరించి, మార్కులు వేసి మండల వ్యవసాయాధికారుల నివేదిక సమర్పించాలని సూచించింది. 50 మార్కులకు తక్కువగా ఉన్న ఆదర్శరైతుల పనితీరు బాగోలేనట్లు నిర్ణయించి వారిని తొలగిస్తారు. ఈ ప్రకారం జరిగితే ప్రస్తుతం ఉన్నవారిలో కనీసం 20 శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారు. ప్రస్తుతం జిల్లాలో 2,511 మంది ఆదర్శ రైతులుగా పనిచేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన పంటనష్టపరిహారం పంపిణీల సమయంలో చాలా మంది ఆదర్శ రైతులు హస్తలాఘవానికి పాల్పడి విమర్శలకు గురయ్యారు.
Share this article :

0 comments: