అధైర్యపడొద్దు.. అండగా ఉంటా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా

Written By news on Tuesday, November 29, 2011 | 11/29/2011

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా


పెదనందిపాడు, న్యూస్‌లైన్: పత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడులో కొమ్మినేని శివశాంతి (45) కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రాత్రి ఓదార్చారు. ఆమె మరణించిన తీరును కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. మీరు అధైర్య పడొద్దు.. మీరు మా కుటుంబ సభ్యులతో సమానం అంటూ వారికి భరోసా ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటానంటూ భర్త రామచంద్రరావు, కుమార్తె త్రిపుర, కుమారుడు నాగబాబులను ఓదార్చారు. ఈ సందర్భంగా రామచంద్రరావు చెప్పారిలా..

ఓదార్పుకు ముందు.. నా భార్య శివశాంతికి దివంగత ముఖ్యమంత్రి అంటే అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో మాకు లబ్ధి చేకూరింది. అలాంటి మహానేత మరణిండనే విషయం తెలుసుకుని ఆయన చనిపోయిన మూడూ రోజులకే గుండెపోటుతో చనిపోయింది. జగన్ మోహన్‌రెడ్డి మా ఇంటికి వస్తారని చెబుతుంటే మేమందరం ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నాం. 

ఆనందంగా ఉంది.. పత్రికల్లో చూడడమే గానీ.. నేరుగా మహానేత తనయుడు జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తామనుకోలేదు. ఈ రోజును మేము ఎప్పటికీ మరిచిపోలేం. ఆయన మాపై చూపిన ప్రేమాభిమానాలు మా ఇంటిల్లపాదికీ ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
 
జగన్ సీఎం కావడం తథ్యం





పిడుగురాళ్ళ, న్యూస్‌లైన్ : రైతులు, మహిళలు, యువకుల అండతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తి చెప్పారు. మండలంలోని బ్రాహ్మణపల్లి దళితవాడలో వైఎస్ విగ్రహ ఏర్పాటుకు సోమవారం మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకటనర్సిరెడ్డితో కలిసి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జంగా మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో దివంగత నేత వైఎస్‌కు ప్రత్యేక గౌరవం ఉందన్నారు. వైఎస్ మరణించిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం పని చేస్తుందా లేదా... అనే పరిస్థితి నెలకొందన్నారు. 

అధికారంలో ఉన్నంతకాలం రైతుల సమస్యలు పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారిపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అధికార పక్షం, ప్రతిపక్షం ఏకమైనా జగన్మోహన శక్తిని ఆపలేరన్నారు. పల్నాడులో త్వరలో జరిగే ఓదార్పుయాత్ర నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుందని జంగా తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కాయితి వెంకట నర్సిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కనివినీ ఎరుగనివన్నారు. ఆయన మరణిస్తే 600 మంది గుండెపగిలి చనిపోయారని గుర్తు చేశారు. 

జగన్ సీఎం కావాలని 150 మంది సంతకాలు పెట్టినా.. అధిష్టానం మాటవిని రోశయ్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించింది జగనేనని గుర్తుచేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు జగన్‌కు అండగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, జెడ్పీటీసీ గండికోట కోటేశ్వరరావు, కట్టా వెంకటేశ్వరరెడ్డి, చంద్రారెడ్డి, పందిటి రామిరెడ్డి, పఠాన్‌మాబు, కత్తెరపు రామోహన్‌రెడ్డి, చల్లాపిచ్చిరెడ్డి, శివారెడ్డి, గుండాల ఆనంద్‌బాబు, పొలేపల్లి బూదయ్య, బీసుపోగు వెంకటేశ్వర్లు, బూసి మరియదాసు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
 
Share this article :

0 comments: