16న షర్మిల పాదయాత్ర 2,000 కి.మీ. సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 16న షర్మిల పాదయాత్ర 2,000 కి.మీ. సభ

16న షర్మిల పాదయాత్ర 2,000 కి.మీ. సభ

Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013

- పశ్చిమగోదావరి జిల్లా రావికంపాడులో 2 వేల కి.మీ.
- పూర్తిచేసుకోనున్న మరో ప్రజాప్రస్థానం
- వైఎస్సార్ సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల హాజరు
- పార్టీ సీనియర్ నేత సోమయాజులు వెల్లడి 
- 17న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం
- ఈ నెల మూడోవారంలో ‘ప్రాణహిత’కు విజయమ్మ 

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే సభకు పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటిస్తారని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ.సోమయాజులు చెప్పారు.

సోమవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండుటెండల్లో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర ఈ నెల 16న పశ్చిమగోదావరి జిల్లాలోని రావికంపాడు(చింతలపూడి నియోజకవర్గం)లో 2 వేల కి.మీ. పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఆ తరువాత షర్మిల మరో వెయ్యి కిలోమీటర్ల మేర యాత్రను కొనసాగిస్తారని చెప్పారు. ‘సభ ముగిసిన మరుసటి రోజు 17న హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం జరుగుతుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ సీజీసీ సభ్యులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు, ప్రాంతీయ కో ఆర్డినేటర్లు, పార్లమెంటు కోఆర్డినేటర్లు, సీనియర్ నాయకులు పాల్గొంటారు’ అని సోమయాజులు వివరించారు.

సోమవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో త్వరలో జరగగలవని భావిస్తున్న పంచాయతీ, స్థానిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల విషయంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. ప్రస్తుత సర్వేల ప్రకారం తమ పార్టీకి అత్యధికంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు వస్తాయని వెల్లడైందన్నారు. ‘2001లో జరిగిన ఎన్నికల్లో కూడా 12 జిల్లా పరిషత్‌లను అప్పటి అధికార పక్ష మైన టీడీపీ కోల్పోయింది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. 

జెడ్పీటీసీ ఎన్నికలు 2014 సాధారణ ఎన్నికల్లో మా పార్టీ గెలుపునకు నాంది కాబోతున్నాయి’ అని అన్నారు. ఈ నెల మూడో వారంలో వై.ఎస్.విజయమ్మ పార్టీ సీనియర్ నేతలతో కలసి ఆదిలాబాద్‌లోని ప్రాణహిత ప్రాజెక్టు సందర్శనకు వెళతారని ఆయన పేర్కొన్నారు. 20, 23 తేదీల్లో ఏదో ఒక రోజు ఆమె వెళ్లవచ్చని తెలిపారు. ఓదార్పు యాత్రను జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వచ్చాక కొనసాగిస్తారని ఆయన వెల్లడించారు. పార్టీలో అభిప్రాయభేదాల విషయమై విలేకరులు అడగ్గా.. కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో ఒక్కొక్క జిల్లాలో వంద గ్రూపులున్నాయి.. అవి మీ దృష్టికి రాలేదా 
Share this article :

0 comments: