నేడు వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్ధాయి సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్ధాయి సమావేశం

నేడు వైఎస్‌ఆర్‌సీపీ విస్తృతస్ధాయి సమావేశం

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

స్ధానిక సంస్ధల ఎన్నికలను ఎదుర్కునేందుకు అవసరమైన వ్యూహలు, కార్యాచరణ, పార్టీ సంస్ధాగత నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ విస్తృతస్ధాయి సమావేశం నేడు జరగనుంది. లోటస్‌పాండ్‌లో జరిగే ఈ సమావేశానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ అధ్యక్షత వహించనున్నారు. 

ఈ సమావేశానికి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీజీసీ, రీజనల్‌ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ అబ్జర్వర్లు, అథికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, అన్ని జిల్లాలు, పట్టణాల కన్వీనర్‌లు, వివిధ కమిటీల సభ్యులను ఆహ్వనించారు. దాదాపు 150 మంది పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హజరవనున్నారు.

 త్వరలో జరుగుతాయని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే వ్యూహమే ప్రధాన ఎజెండాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం శుక్రవారం నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గ్రామ స్థాయి నుంచి జరిగే ఎన్నికలు కాబట్టి పార్టీని కింది నుంచీ పటిష్టం చేసుకునేందుకు వీటిని ఒక సదవకాశంగా ఉపయోగించుకోవాలని వైఎస్సార్ సీపీ భావిస్తోంది. ఇప్పటికే జరుగుతున్న సభ్యత్వ నమోదుపై కూడా సమావేశంలో సమీక్ష జరుగనుంది. 

అలాగే స్థానికంగా పార్టీ తరఫున నేతలు చేపడుతున్న కార్యక్రమాలపైనా సమీక్ష ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీలో క్రియాశీలక సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించే విషయంపైనా చర్చ ఉంటుందని వెల్లడించాయి. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ అధ్యక్షతన ఆమె క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ), క్రమశిక్షణా కమిటీ, సంస్థాగత వ్యవహారాల కమిటీ, మానవ వనరుల కమిటీ సభ్యులు, లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా, సిటీ పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్లు, రాష్ట్ర పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను ఆహ్వానించినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల రాష్ట్ర కోఆర్డినేటర్ పి.ఎన్.వి.ప్రసాద్ తెలిపారు.
Share this article :

0 comments: