సింగిల్‌విండోల్లో వైఎస్సార్‌సీపీ హవా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సింగిల్‌విండోల్లో వైఎస్సార్‌సీపీ హవా

సింగిల్‌విండోల్లో వైఎస్సార్‌సీపీ హవా

Written By news on Saturday, June 1, 2013 | 6/01/2013

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా నడుస్తోంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఎర్రావారిపాళెం సింగిల్‌విండో డెరైక్టర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. మొత్తం 13 స్థానాలకుగాను 6 స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు-3, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్.మురళి తెలిపారు. ప్రకాశం జిల్లాలో 16 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో వైఎస్సార్‌సీపీ హవా నడుస్తోంది. తాజా షెడ్యూల్ ప్రకారం ఈ 16 సొసైటీల్లో శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఐదు సొసైటీల్లో మెజార్టీ వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన వాటిలో నామమాత్రపు పోటీ నెలకొంది. ఒక్కో సొసైటీలో 13 డెరైక్టర్ స్థానాలుంటాయి. సంతనూతలపాడు మండలం గురవారెడ్డిపాలెం సొసైటీలో11, బేస్తవారిపేటలో10, గలిజేరుగుళ్లలో 8, పెద్దారవీడులో 8, అద్దంకి మండలం ధర్మవరం సొసైటీలో 7 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ బలపరిచిన వారు ఏకగ్రీవమయ్యారు. దీంతో ఆ సొసైటీలు వైఎస్‌ఆర్‌సీపీ వశం కానున్నాయి. 
Share this article :

0 comments: