మూడు రోజుల్లో చేసిన మూడు ప్రకటనలివి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడు రోజుల్లో చేసిన మూడు ప్రకటనలివి

మూడు రోజుల్లో చేసిన మూడు ప్రకటనలివి

Written By ysrcongress on Wednesday, February 22, 2012 | 2/22/2012

-విశ్లేషణ
చెముకలసుధాకర్
రాష్ట్ర కన్వీనర్ సామాజిక 
జైఆంధ్ర మహాసభ, రాష్ట్ర కో-కన్వీనర్, బీసీ మహాజన సమితి

అవినీతి నిర్మూలనలో అపర హజారేనని చెప్పు కుంటూ మరో పక్క తన ఆస్తి ఒక హజారే (వెయ్యి కోట్లు) అంటున్న నీతి చంద్రుడి అవినీతి బాగోతానికి అంతేలేదు. చంద్రబాబు ఆ మధ్య ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. వెయ్యి కోట్ల రూపా యలు ఎవరైనా ఇస్తే తన ఆస్తు లన్నింటినీ రాసిచ్చేస్తానన్నారు. ఈ ప్రకటన చూసి విని లేదా చదివి ఆశ్చర్యపోవలసిన పనిలేదు. అసహ్యించు కోవలసిన పని అంతకన్నా లేదు. ప్రకటన వెనుక ఉన్న ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుంటే చాలు. వెయ్యి కోట్లు ఇస్తే ఆస్తులు రాసిపారేస్తానని అనడం ద్వారా కాంగ్రెస్ వాళ్లకి ముఖ్యంగా వైఎస్సార్ పార్టీ నాయకులకి ఒక సవాల్ విసిరినట్లు ఆయన భావించారు. అంతేకాకుండా రెండెకరాల బాబుకు రెండు వేల కోట్లు ఎలా వచ్చాయని చాలా మంది నిలదీస్తున్నందున అది తప్పని తనకున్నది వెయ్యి కోట్లు మాత్రమేనని, ఇంకా చెప్పాలంటే జగన్ వద్ద మూలుగుతున్నాయని నెత్తీనోరు బాదుకుంటూ తాను ఆరోపిస్తున్న 50 వేల కోట్లో, లక్ష కోట్లో తన వద్ద లేవని, ఉన్నదల్లా ముష్టి వెయ్యి కోట్ల ఆస్తేనని ఆయన స్పష్టం చేయదలుచుకున్నారు.
మరో సభలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. ‘‘36 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. రాష్ట్రం కోసం, ప్రజల కోసం శ్రమించాను. ఏ పరిశ్రమ పెట్టుకునో ఈ మాత్రం శ్రమిస్తే ఈ పాటికి టాటా బిర్లాలంత ధనవంతుడినయ్యేవాడిని’’ అని కంఠం పెంచి చెప్పారు. మర్నాడు స్వగృహంలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. వైఎస్‌ఆర్ పేరెత్తకుండా ఆయనిలా అన్నారు. ‘‘2004లో ఏమీ లేనివాళ్లు వందల, వేల కోట్లు సంపాదిం చారు. రాజకీయ, మైనింగ్ మాఫియాలుగా మారారు. ఆ అవినీతి డబ్బుని ప్రజలకు వందో, రెండొందలో పంచారు. డబ్బు తీసుకున్నాం కనుక, ఓటు వెయ్యాలని ప్రజలు నీతిగా ఫీలయ్యారు. అలా వందో, రెండొందలో పంచిన వాళ్లని పదేళ్లు డీబార్ చేసేలా సంస్కరణలు రావాలి’’ అంటూ చిందులేశారు. జోక్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో నిరుపేద జనానికి నగదు బదిలీ అనే పథకాన్ని కనిపెట్టిందీ, ప్రచారంతో హోరెత్తించిందీ, ఆనక ఓడిపోయిందీ చంద్రబాబే. ఈయన మూడు రోజుల్లో చేసిన మూడు ప్రకటనలివి.

నా ఆస్తి వెయ్యి కోట్లు మాత్రమే. (బినామీ పేర్లమీద ఉన్నది ఇంకెన్ని కోట్లో..?)
దిక్కుమాలిన ప్రజాసేవ మూలాన టాటా బిర్లాలంత డబ్బు సంపాదించే అవకాశం చేజార్చుకున్నాను.

ముష్టి వంద, రెండొందల రూపాయలైనా సరే ప్రజ లకు పంచడం ఎన్నటికీ జరగకూడదు.
కొంచెం ఇంగితంతో గమనిస్తే ఒక వ్యక్తి మైండ్‌సెట్ ఏమిటో అవగతం చేసుకోవచ్చు. డబ్బు, మరింత డబ్బు... ఆస్తి, మరిన్ని ఆస్తులు... అదే లక్ష్యం...ధ్యేయం... జీవితాశయం... పరమార్థం... మోక్షం...! నోట్లకట్టల మీద నోట్లకట్టలు, అంతస్తుల మీద అంతెత్తున పైఅంతస్తులు.

1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో పుట్టిన చంద్రబాబు పుట్టుకతో పేదవాడే. ఖర్జూర నాయుడు అనే రెండెకరాలు మాత్రమే ఉన్న పేద రైతు ఇంట పుట్టాడు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు రాయలసీమ పేదరికం గురించి చెబుతూ... ‘‘ఓ రోజు మాయమ్మ అన్నం పెట్టాక, కోడిగుడ్డుని రెండుగా చేసి నాకో ముక్క, మా అక్కకో ముక్క వేసింది. చిత్తూరు జిల్లాలో ఏ తల్లి అయినా ఇలాగే చేస్తది. చంద్రబాబుకి, రామ్మూర్తి నాయుడికీ అమ్మణమ్మ కూడా ఒక గుడ్డుని రెండు ముక్కలు చేసి పెట్టి ఉంటుంది’’ అని రాశారు. బాబు పేదరికాన్ని నామిని ఇలా నిర్ధారించారు.

1978లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. 28 ఏళ్లకే కేబినెట్ మంత్రి పదవి! తర్వాత ‘మామకు యముడు- అమ్మాయికి మొగుడు’ అని రామోజీరావు చూపించిన సినిమా పెద్ద హిట్టయింది కదా! రాష్ట్ర ముఖ్యమంత్రిగా, సీఈఓగా, ఐటీ బూమ్ ఆద్యునిగా, క్లింటన్‌ని రాష్ట్రానికి తెచ్చినవాడుగా, లౌక్యునిగా, చాణక్యునిగా కీర్తిని, అపకీర్తిని మూట గట్టుకు న్నారు. అలిపిరిలో నక్సలైట్ల దాడి నుంచి బతికి బయటపడ్డారు. చంద్రబాబు పెద్ద వక్తా కాదు. ఆయన ఉపన్యాసం ప్రజలను ఉత్తేజపరచిన సందర్భం లేదు. ‘ఈనాడు’ పత్రిక, ‘ఈటీవీ’ మరికొన్ని టీవీ చానళ్లు చంద్ర బాబు వీరుడని, శూరుడని ఊదర గొట్టడం తప్పితే, ‘అబ్బా ఏం చెప్పాడు గురూ... చంద్రబాబు!’ అని ఎప్పుడూ, ఎవరికీ అనిపించిన దాఖలాలు లేవు.

రాష్ట్రంలో ఆయన ప్రసంగం ఎవరికైనా ఉపయోగపడింది అంటే అది మిమిక్రీ ఆర్టిస్టులకు మాత్రమే. ఎదుటివాడిని బెదిరిస్తున్నట్టుగా మాట్లాడతారు. వేలు ఊపుతూ జాగ్రత్త అని మందలిస్తున్నట్టుగా, హెచ్చరిస్తున్నట్టుగా భయపెడ తారు. అందుకేనేమో జర్నలిస్టు, రచయిత కె.ఎన్.వై. పతంజలి ఒక సంద ర్భంలో, నక్క కళ్లు, మేక గడ్డం ఉన్న ప్రతివాడూ చంద్రబాబు నాయుడు కాలేడని వెటకారంగా అన్నారు. ఇంకా సంపాదించలేకపోయానే అన్న అసం తృప్తి, మరోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయానన్న నిరాశ ఆయనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. నిద్రకు దూరం చేస్తున్నాయి. 

ఎందుకిలా జరుగుతోంది...?

కొన్నేళ్ల క్రితం ఎన్నికల సమయంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు సి.నరసింహారావు ఒక వ్యాసంలో ‘‘రాజకీయ అధికారం అనేది చంద్రబాబుకి మానసిక అవసరం. ఆ అవసరం అనే రుగ్మత పేరే డబ్బు. కొత్తగా డబ్బు సంపా దిస్తున్నప్పుడు గమ్మత్తుగా ఉంటుంది. ఇబ్బడి ముబ్బడిగా వచ్చి చేరుతున్న కొద్దీ ‘ఇగో’ పెరిగిపోతూ ఉంటుంది. తరువాత అది క్రమేపీ కొవ్వుగా పేరుకు పోతుంటుంది. తర్వాత తల పొగరుగా మారుతుంది’’ అంటూ వ్యాఖ్యానిం చారు. ఇది చంద్రబాబు ఒక్కడి సమస్యే కాదు. మెగాస్టార్ చిరంజీవిదీ అదే బాధ, బొత్స సత్యనారాయణకూ అదే దిగులు. ఎవరితోనైనా లాలూచీ పడి కనీసం ఒక్కసారైనా ముఖ్యమంత్రి కావాలని లగడపాటి కల.

ఇక ముఖేష్ అనే అంతర్జాతీయ వ్యాపారస్తుడు ముంబైలో వందల కోట్లు ఖర్చు పెట్టి బడా భవంతి కట్టుకున్నాడు. అది చూసి విస్తుపోయిన రతన్ టాటా ఇలాంటి పిచ్చి పనులవల్లే దేశంలో ఉద్యమాలు, విప్లవాలు వస్తాయన్నారు. 

గతంలో పెంపుడు కొడుకు పెళ్లికి తమిళనాడు సీఎం జయలలిత 150 కోట్లు ఖర్చు పెట్టింది. కరుణానిధి సంపాదించినదైతే, తీహార్ జైల్లో కూర్చుని తీరిగ్గా లెక్క పెట్టుకున్నా తనివి తీరదు. చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి అంబేద్కర్, జ్యోతిరావ్ ఫూలే బొమ్మలు చూపి కొన్ని వేల కోట్లు వెనకేసుకున్నాడు. ‘సామా జిక స్పృహ’ని అరమైలు లోతు గుంటతీసి పాతేశాడు. ఓట్లేసిన ప్రజలను మోసం చేసి కాంగ్రెస్‌లో చేరిపోయాడు. ప్రజల కోసం సినిమాలు త్యాగం చేసిన మాట ఎలా ఉన్నా, డబ్బు కోసం ప్రజారాజ్యం పార్టీని త్యాగం చేశాడు. చిరం జీవి పుట్టిన రోజుకి రామ్‌చరణ్ తేజ కారు బహుమానంగా ఇచ్చాడు. దాని ఖరీదు రూ.4 కోట్లు. ఇంత ఖరీదైన కారు ఇవ్వడం ఎబ్బెట్టుగా ఉంటుందన్న ఆలోచన ఆ కొడుక్కూ లేదు, తండ్రికి అంతకన్నా లేదు.

‘‘నా ఆస్తి వెయ్యి కోట్లే. భూములు, తోటలు నా బంధువులవి, నావి కాదు’’ అంటాడు చంద్రబాబు. ‘‘నా మార్గదర్శి, నా ఈనాడు, నా ఫిల్మ్‌సిటీ, నా పొడులూ, నా పచ్చళ్లూ... అన్నీ నా రెక్కల కష్టం’’ అంటాడు రామోజీ. దొంగలకు భయం ఉండదు. రాజకీయ దొంగలకి సిగ్గుండదు. ప్రజల కోసం బతుకంతా శ్రమిస్తున్నట్లు నటిస్తూ వాళ్ల చెవుల్లో నిరంతరం పూలు పెడుతూ ఉంటారు.

చంద్రబాబు భారతదేశంలోనే ధనవంతుడైన రాజకీయవేత్త. ఆయన ఆస్తుల విలువ దాదాపు రూ.2,000 కోట్లు. నిత్యం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని స్మరణ చేస్తూ, హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేసిన చంద్రబాబు దాని సమీపంలోనే 120 ఎకరాలు కొన్నారు. ఆయనకు మలేసియాలో షాపింగ్‌మాల్, సింగపూర్‌లో హోటల్ ఉన్నాయి. ఒడిశా తీర ప్రాంత గ్రామం గోపాల్‌పూర్‌లో 100 ఎకరాలు కొనుగోలు చేశారు. విశాఖ పట్నంలోని ఒక కేంద్ర సంస్థ సాంకేతిక సహకారంతో సింథటిక్ ముత్యాలు తయారు చేసే నర్సరీని చంద్రబాబు నెలకొల్పబోతున్నారు. బెంగళూరు శివార్లలో హోసూర్ రోడ్డులో చంద్రబాబు 45 ఎకరాలు కొనుగోలు చేశారు. 1989-94 మధ్య తన వ్యాపారాలను మరింత విస్తరించారు. జూబ్లీహిల్స్‌లో భారీ భవంతి కట్టారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో 300 ఎకరాలు కొని పండ్ల తోటలు పెంచుతున్నారు. చంద్రబాబు ఫామ్‌హౌస్ తోటలకు సంబంధించిన 1.3 లక్షల మేర కరెంటు బిల్లులు కట్టకపోవడంపై అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. హాలెండ్ నుంచి తెప్పించిన యంత్రాలతో కుప్పంలో నెలకొల్పిన హెరిటేజ్ యూనిట్ నుంచి రోజూ బెంగళూరుకి 25,000 లీటర్ల పాలు సరఫరా అవుతాయి. చంద్రబాబుకి ఊటీలోనూ, చెన్నైలోనూ, ముంబైలో కూడా ప్లాట్లు ఉన్నాయి. చంద్రబాబు సంపాదించిన ఆస్తులకూ కూడబెట్టిన సొమ్ముకూ అంతూ పొంతూ లేదు. సంపాదించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఎందుకు సంపాదించపోయానన్న దుగ్ధే ఆయన వర్తమాన రాజకీయ ఆచరణకు ఇంధనం. భావి వ్యూహరచనకూ అదే మూలాధారం
Share this article :

0 comments: