ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే

ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012

ఓదార్పు దారిలో జనకేతనం రెపరెపలాడుతోంది. అలుపన్నదే ఎరుగని జననేతతో ప్రజలంతా కలిసి నడుస్తున్నారు. ఆయన అడుగులో అడుగు వేస్తున్నారు. తమ క్షేమం కోరిన జననేతకు ఊరూవాడా కలిసి అపూర్వ స్వాగతం పలుకుతోంది. ఈ చేతులు నీకు జై కొట్టేందుకే.. ఈ కాళ్లు నీ వెంట నడిచేందుకే.. అన్నంతగా యువకులు అభిమానం చాటుతున్నారు. ‘నిన్ను చూస్తే.. మాకు అడగకుండానే వరాలిచ్చిన ఆ మహానేత గుర్తుకొస్తున్నాడు. నువ్వు చల్లగా ఉండాలి బాబూ..’ అంటూ వృద్ధులు మనసారా దీవిస్తున్నారు. మహిళలు తమ ఆత్మీయ బంధువు ఇంటికొచ్చినట్లు, బొట్టుపెట్టి హారతిచ్చి స్వాగతిస్తున్నారు. మా కష్టాలు తీర్చే నాథుడు నువ్వే.. అంటూ అన్నదాత ఆశిస్తున్నాడు. అందరి సమస్యలు వింటూ.. కొండంత భరోసా ఇస్తూ ఓదార్పు యాత్రలో జగన్ ముందుకు సాగుతున్నారు. 
రొంపిచర్ల, న్యూస్‌లైన్ : అభిమానం వెల్లివిరిసింది. పల్లెల్లో ప్రజలు జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. ఓదార్పు యాత్రలో 64వ రోజైన గురువారం నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంలోని పది గ్రామాల్లో 27 కిలోమీటర్లు జగన్ పర్యటించారు. పది వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. యాత్ర సాగిందిలా.. గురువారం ఉదయం 9.45 గంటలకు రొంపిచర్లలో పార్టీ నాయకులు మెడికొండ శ్రీనివాసరెడ్డి నివాసం నుంచి ఓదార్పుయాత్రను ప్రారంభించారు. తొలుత బీసీ కాలనీ చేరుకుని అక్కడ కూలీలను పలకరించి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తంగెడుమల్లి మేజర్ కాలువ వద్ద రైతులు, రైతు కూలీలు జగన్‌ను కలసి తమ సమస్యలను విన్నవించారు. అనంతరం కొనకంచివారిపాలేనికి చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ తిరుపాల్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. 

అనంతరం పాలకేంద్రం సెంటర్ చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి గోగులపాడు పయనమైన జగన్‌కు మార్గం మధ్యలో మిర్చి రైతు పొనుగోటి వెంకటేశ్వర్లు పూర్తిగా నష్టపోయామంటూ కష్టాలను విన్నవించారు. అనంతరం గోగులపాడు చేరుకుని తొలుత ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఎస్సీ కాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్థానిక నాయకులు దావులూరి అంజయ్య, పొందూరి శ్రావణ్‌కుమార్, తుర్లపాటి వీరాంజనేయులు నేతృత్వంలో 800 మంది కార్యకర్తలు జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం సెవెన్త్‌డే అడ్వంటిస్ట్ చర్చిలో ఫాదర్ సాతులూరు శ్యామ్‌సన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో జగన్ పాల్గొన్నారు. అనంతరం దావులూరు అంజయ్య నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత సీతారామాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి లూథరన్ చర్చి చేరుకుని ఫాదర్ జి.మోహన్‌రావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అలవాలలో ఘనస్వాగతం..
అక్కడ నుంచి అలవాల చేరుకున్న జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలికారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి జగన్ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సెవెన్త్ డే అడ్వంటిస్ట్ చర్చిలో ఫాదర్ కడియం విక్టర్‌బాబు, తెలుగు బాప్టిస్టు చర్చిలో ఫాదర్ కాకాని ఏసోబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం బీసీ కాలనీ చేరుకుని అంకమ్మగుడిలో పూజారి తన్నీరు వెంకటేశ్వర్లు చేసిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గ్రామ ప్రధాన సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం చిట్టిపోతులవారిపాలెంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సుబ్బయ్యపాలెం వెళ్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా వీరవట్నం గ్రామస్తులు జగన్ తమ గ్రామానికి రావాలని పట్టుపట్టారు. అన్నవరం అడ్డరోడ్డులోని ఎస్సీకాలనీలో వైఎస్సార్ విగ్రహాన్ని, రామాలయం సెంటర్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ మరో విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులు మారెళ్ల శివారెడ్డి నివాసంలో అల్పాహార విందులో పాల్గొన్నారు. అక్కడ నుంచి వీరవట్నం చేరుకున్నారు. తొలుత గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పాత చర్చిలో ఫాదర్ ఇస్సాక్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. 

అనంతరం గ్రామంలో మరణించిన సాయి కోటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి అక్కడ నుంచి పయనమై వడ్లమూడివారిపాలేనికి చేరుకున్నారు. అన్నెం సీతారెడ్డి నివాసంలో అల్పాహార విందులో పాల్గొని అనంతరం సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తర్వాత ఎస్సీ కాలనీలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బస్సుషెల్టర్ వద్ద వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడినుంచి గ్రామ ప్రధాన సెంటర్‌కు చేరుకుని వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అక్కడ నుంచి తిరుగు పయమై అల్లూరివారిపాలెంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నరసరావుపేట చేరుకొని పార్టీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి రాత్రిబసకు చేరుకున్నారు.

ముఖ్యనేతల హాజరు
విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ సభాధ్యక్షత వహించారు. పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, కృష్ణాజిల్లా నేత పి.గౌతమ్‌రెడ్డి, గుంటూరు జిల్లా నాయకులు ఆర్కే, జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, నసీర్ అహ్మద్, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఆతుకూరి ఆంజనేయులు, డైమండ్‌బాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్ గజ్జల నాగభూషణరెడ్డి, డాక్టర్ యజ్ఞనారాయణరెడ్డి, కట్టా సాంబయ్య, శాస్త్రి, మేరిగ విజయలక్ష్మి, దేవళ్ల రేవతి, శ్రీరెడ్డి, మండెపూడి పురుషోత్తం, ఇందూరి నరసింహారెడ్డి, సానికొమ్ము కోటిరెడ్డి, పిల్లి ఓబుల్‌రెడ్డి, చింతా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కాంగ్రెస్‌పార్టీ నేత, పీఆర్పీ గుంటూరు నగర కన్వీనర్ షేక్ షౌకత్ కలిశారు. ఓదార్పుయాత్రలో భాగంగా గురువారం రొంపిచర్లలో బసచేసిన జగన్‌కు పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, జిల్లా నాయకులు ఆర్కే తదితరులు షౌకత్‌ను పరిచయం చేశారు. షౌకత్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్‌గా, అనంతరం ప్రజారాజ్యంపార్టీ నగర కన్వీనర్‌గా పనిచేశారు. 2009 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలై రెండోస్థానంలో నిలిచారు.ప్రస్తుతం కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అందుకే జగన్‌ను కలిసి తన మనోగతాన్ని వెల్లడించానని షౌకత్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగే ఓదార్పుయాత్రలో పాల్గొని జగన్ సమక్షంలో ఐదువేల మంది కార్యకర్తలతో పార్టీలో చేరనున్నట్లు వివరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆయనను పార్టీ జిల్లా ఇన్‌చార్జి జ్యోతుల నెహ్రూ, జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, జిల్లా నాయకులు ఆర్కే, నగర కన్వీనర్ లేళ్ళ అప్పిరెడ్డి తదితరులు పార్టీలోకి ఆహ్వానించారు.


 
Share this article :

0 comments: