జగన్ కోసం '1,24,36,000' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ కోసం '1,24,36,000'

జగన్ కోసం '1,24,36,000'

Written By news on Tuesday, January 8, 2013 | 1/08/2013

Written by Rajababu On 1/8/2013 1:45:00 AM
వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయటమే కాకుండా బెయిల్ ఇవ్వనందుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన కోటిసంతకాల సేకరణకు నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. వివిధ జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఐదురోజులు నుంచి చేపట్టిన కోటిసంతకాల సేకరణ కార్యక్రమానికి పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఇప్పటికి కూడా సంతకాలు చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రాష్ట్రంలో జగన్‌కు ఉన్న ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కుమ్మక్కై ఆయన్ను అక్రమంగా అరెస్టు చేయించారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా.. సంతకం రూపంలో నిరసన వ్యక్తం చేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా చేపట్టిన ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమాన్ని అనూహ్య ప్రజాదరణ లభిస్తోందని సోమవారం నాడు పార్టీ కేంద్ర కార్యాలయంలో నేతలు వెల్లడించారు. ఆదివారం నాటికి కోటీ 24 లక్షల 36 వేల సంతకాలు పూర్తయ్యాయని చెప్పారు. జగన్ కోసం జనం సంతకం కార్యక్రమానికి ప్రజాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని జనవరి 10 తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీలతో కలిసి సీబీఐ చేస్తున్న నీచమైన కుట్రలను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమంలో పాల్గొంటున్నారన్నారు.

త్వరలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అపాయింట్‌మెంట్ తీసుకొని, ప్రజల నుంచి సేకరించిన సంతకాలను అందజేయనున్నట్లు చెప్పారు. అదే విధంగా జగన్ సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సాధ్యమైనంత త్వరలో ప్రారంభమవనున్నట్లు తెలిపారు. షర్మిల మోకాలికి జరిగిన ఆపరేషన్ కుట్లను రెండురోజుల క్రితమే తీశారని, త్వరలోనే పాదయాత్ర పునఃప్రారంభిస్తారని చెప్పారు.

జగన్ విడుదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఇటీవల కాలంలో స్వచ్చందంగా ముందుకు వచ్చి అనేక కార్యక్రమాలను చేపట్టారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ పిలుపు మేరకు జగన్ కోసం జనం సంతకం ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత కూడా తరగని అభిమానం చూపడం ఇక్కడ గమనించాల్సిన విషయం. సంతకం రూపంలో ప్రజలు వెల్లడించిన అభిప్రాయంపై రాష్ట్రపతి ప్రణబ్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు కుంటుపడి.. పెట్రల్, విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రజలను ఆదుకోవడానికి, రాజన్న రాజ్యం తీసుకు రావడానికి కృషి చేస్తున్న వైఎస్ జగన్ కు మరోసారి ప్రజల అండగా నిలబడ్డారని 'సంతకం' రూపంలో రుజువైంది.

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=55599&Categoryid=28&subcatid=0
 
Share this article :

0 comments: