జగన్ మనోధైర్యానికి హ్యాట్సాఫ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ మనోధైర్యానికి హ్యాట్సాఫ్!

జగన్ మనోధైర్యానికి హ్యాట్సాఫ్!

Written By news on Wednesday, January 9, 2013 | 1/09/2013


జగన్ కోసం
నేను వైఎస్సార్ అభిమానిని. అందుకు కారణం ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల నా కొడుకు ఇంజినీరింగ్ పూర్తిచేసి జాబ్ చేస్తున్నాడు. కులమతాలతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే మంచి ఆలోచన వారికి వచ్చినందుకే ఇది సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో కుటుంబాలు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ధి పొందినవారే. అందుకు కృతజ్ఞతలు తెలుపుకుందాం అనుకునేలోగా ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు వారి కొడుకు జగన్ మీద కృతజ్ఞత చూపించాలని ప్రజలు తహతహలాడుతున్నారు. కానీ సీబీఐ ఆయన్ని జైలుపాలు చేసింది.

సీబీఐ ఈ రాష్ట్రప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఓపెన్ డిబేట్ పెట్టాలి. న్యాయవాదులు, విశ్లేషకులు, ఉన్నతాధికారులు, పదవీవిరమణ చేసిన సీబీఐ ఆఫీసర్లు వ్యక్తం చేసిన సందేహాలు ఇప్పుడు సామాన్యప్రజల మదిలోనూ మెదులుతున్నాయి. కాంగ్రెస్, టీడీపీల కుట్రలకు సీబీఐ వంత పాడటం చూసి, సీబీఐని నేరుగా ప్రశ్నిస్తున్నాను - ఎవరి ఆదేశాల మీద మీరు జగన్‌ని అరెస్ట్ చేశారు? మాట తప్పని మడమ తిప్పని నాయకుని కుమారుడు జగన్ ఓదార్పు యాత్రతో రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకున్నారు.

స్త్రీశక్తి ఎదుట ఎవరూ ఆగలేరని నిరూపిస్తూ విజయమ్మ దీక్షలతో, బహిరంగ సభలతో, షర్మిల పాదయాత్రతో, భారతి తన లేఖలతో ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్నారు. ఇదంతా చూసిన కాంగ్రెస్, టీడీపీవాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాళ్ల డిపాజిట్లు గల్లంతు అని వారికి రూఢీగా తెలుసు కనుకనే ఆ కుటుంబం మీద సీబీఐ కేసులు పెట్టాలని వారి మనస్సులోని ద్వేషాన్ని మాటలుగా మార్చి, మీడియాలో వినిపిస్తున్నారు. వీరందరికీ ఓటుతోమాత్రమే బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోయాం.

వైఎస్సార్‌సీపీ నాయకులడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కొందరు, జగన్ జైల్లో ఎందుకున్నాడని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. కుళ్లు, కుతంత్రాలు తెలియక, కాంగ్రెస్‌లోనే ఉంటూ వెన్నుపోటు పొడవలేక ఉదాత్తమైన మనస్సు కలవాడు కనుకనే పార్టీ నుంచి బయటకొచ్చి కష్టాలు పడుతున్నాడు. ఈ కష్టాలు కలకాలం ఉండవు. కాబోయే సీఎం జగన్ అని జనం ఫిక్స్ అయిపోయారు.

హైకోర్టు న్యాయవాదులు బెయిల్ రాకపోవడం అన్యాయం అనడం చూశాను. న్యాయవాదులందరూ ఏకమై కుట్రలకు వ్యతిరేకంగా ఈ విషయంపై న్యాయవ్యవస్థను ప్రశ్నించాలని కోరుకుంటున్నాను. జగన్ చిరునవ్వుతో బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయాలి. ఆయన మనోధైర్యానికి హ్యాట్సాఫ్!
- ఎస్.శిరీష, నెల్లూరు

అంతా ఏకమై కుట్ర పన్నారు!
జగనన్నను జైల్లో పెట్టి రెండు వందల రోజులు దాటిపోయింది. ఇంతవరకూ సీబీఐ ఏమీ నిరూపించకుండా ఆయన్ని పూర్తిగా కుట్రతో కూడిన రాజకీయాలతో జైల్లోనే బంధించి ఉంచింది. చంద్రబాబు పాదయాత్ర చేస్తూ మధ్యమధ్యలో జగన్ అవినీతి గురించి మాట్లాడుతూ ‘ఆయన లక్షల కోట్లు సంపాదించాడు’ అంటున్నారు. జగనన్న బయటికి వస్తే చంద్రబాబు పాదయాత్ర చేసుకోలేడు.

ఆయనకి ఇప్పటినుంచే జగన్ భయం పట్టుకుంది. అందుకే టీడీపీ, కాంగ్రెస్, సీబీఐ అందరూ కలిసి జగన్‌ను జైల్లో పెట్టారు. అసలు జగన్ మీద కేసులు ఆయన కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీ పెట్టినప్పటినుంచే మొదలయ్యాయి. ఇది కుట్రతో కూడినదని చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తాడు. ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. వైఎస్సార్ సోనియా కొడుకుని ప్రధానమంత్రిని చేయాలనుకున్నారు.

కానీ సోనియా ఏం చేశారు?! రాజశేఖరరెడ్డి కొడుకుని జైల్లో పెట్టించారు! ఇది ఎంతవరకు సమంజసం? ఆ కుటుంబానికి, రాష్ట్రానికి పెద్దదిక్కయిన వైఎస్సార్ చనిపోయాడు. జగన్‌ను జైల్లో పెట్టారు. ఇది న్యాయమా? ఇలా చేస్తే ప్రజలు హర్షించరు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా జగనన్నపార్టీకి 200 పైచిలుకు సీట్లు వస్తాయి. జగనన్న తొందరగా బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
- బి.లోకేష్‌రెడ్డి, రాజంపేట, కడప
Share this article :

0 comments: