జగన్ దీక్షపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ దీక్షపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం

జగన్ దీక్షపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం

Written By news on Sunday, August 25, 2013 | 8/25/2013

హైదరాబాద్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షపై ఎల్లో మీడియా కుట్ర మొదలైంది. ప్రజల కోసం చేస్తున్న దీక్షను సాకుగా చూపి ప్రత్యేక ఖైదీ హోదాను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది. దీక్ష చేపట్టడం ప్రతి పౌరుడికీ రాజ్యంగం కల్పించిన హక్కు. అయితే ఆ హక్కును కాలరాసే ప్రయత్నం ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక ఖైదీ హోదా రద్దు చేయాలంటూ న్యాయస్థానంలో సవాల్ చేస్తారంటూ ప్రచారం చేపట్టింది.

కాగా  ఆమరణ దీక్ష చేస్తున్నా జైలు నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కో-ఆర్టినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. విచారణలో ఉన్న వ్యక్తికి ములాఖత్ లు అనేవి చట్టపరమైన హక్కులని పేర్కొన్నారు. ములాఖత్ లను ఎవరూ రద్దు పరచలేరని, ములాఖత్ ల ద్వారా కలవాలా, లేదా అనేది జగన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందన్నారు. నిరాహార దీక్ష అనేది వ్యక్తి స్వాతంత్ర్యానికి సంబంధించిదన్నారు.

రేపటి నుంచి జైల్లో జగన్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపటి నుంచి జైల్లోనే నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని ఆ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు  కొణతాల రామకృష్ణ తెలిపారు. విభజన వల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా  కాంగ్రెస్‌ పార్టీ ఏకపక్షంగా, నిరంకుశంగా నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
చంచల్ గూడ జైల్లో శనివారం జగన్ ను కలిసిన అనంతరం కొణతాల పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జగన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఈ పరిణామాలను కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు ఆలోచించలేకపోతున్నాయని బాధపడ్డారని, అలాగే విజయమ్మ దీక్షను భగ్నం చేసిన తీరుపట్ల జగన్ ఆవేదన చెందారని కొణతాల తెలిపారు.

జగన్‌ను అణగదొక్కాలన్న  కుట్రతోనే కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర విభజనకు సిద్ధమయ్యిందన్నారు. ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, వారికి అండగా ఉండి ధైర్యం నింపేందుకు షర్మిల త్వరలో బస్సుయాత్ర చేపడతారని కొణతాల చెప్పారు.  ఓట్లు, సీట్లకోసం కాంగ్రెస్‌, టీడీపీ మౌనం వహించడం బాధ కలిగించిందని జగన్ అన్నారని, ఈ సమయంలో స్పందించకుంటే రాష్ట్రం ఎడారి అవుతుందని ఆయన తెలిపారని కొణతాల పేర్కొన్నారు. చంద్రబాబు స్పందించకపోవటం దారుణమని, బాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు.
Share this article :

0 comments: