విల్లా ప్లాటు కొన్నది.. గజం 5వేలకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విల్లా ప్లాటు కొన్నది.. గజం 5వేలకే

విల్లా ప్లాటు కొన్నది.. గజం 5వేలకే

Written By ysrcongress on Tuesday, March 27, 2012 | 3/27/2012

ఎమ్మార్ టౌన్‌షిప్‌లో తాము కొనుగోలు చేసిన విల్లా ప్లాటుకు చదరపు గజానికి రూ. 5 వేలు మాత్రమే చెల్లించామని నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంచేశారు. ఎమ్మార్ టౌన్‌షిప్‌లో 2,440 చదరపు గజాల ప్లాటును కొనుగోలు చేయాలని భావించి 2006లో తమ కూతురు బ్రహ్మణి పేరిట బుక్ చేశామని ఆమె తెలియజేశారు. చదరపు గజానికి రూ. 5,000 చొప్పున ఒక కోటి 16 లక్షల రూపాయలు చెల్లించామని చెప్పారు. 2010 మార్చి 31న తన కూతురు పేరుతో ప్లాట్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తయిందని ఆమె తన వాంగ్మూలంలో తెలియజేశారు. 

ఎమ్మార్ టౌన్‌షిప్‌లో చదరపు గజం రూ. 15 నుంచి రూ. 20 వేలకు కొనుగోలు చేసినట్లు.. ప్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి సీబీఐ వాంగ్మూలాలు సేకరిస్తుండగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ భార్య మాత్రం తమ కూతురి పేరుతో కొనుగోలు చేసిన ప్లాటుకు చదరపు గజానికి రూ. 5,000 మాత్రమే చెల్లించినట్లు పేర్కొనటం గమనార్హం. వసుంధర వాంగ్మూలంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే... 

‘‘2007 సంవత్సరంలో మణికొండ గ్రామం దగ్గర ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్‌కోర్సు, విల్లా ప్లాట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేస్తోందని నా స్నేహితుల ద్వారా తెలుసుకున్నా. ఆ ప్రాజెక్టులు నా మిత్రులు కొందరు అప్పటికే ప్లాట్లు బుక్ చేసుకున్నారు. నా స్నేహితుల నుంచి కె.శ్రీనివాసరావు ఫోన్ నంబర్ తీసుకుని, 2006 చివర్లోనో, 2007 జనవరి మొదట్లోనో ఫోన్‌లో సంప్రదించా. కొన్ని రోజుల తర్వాత ఆయన ప్రాజెక్టు లే అవుట్ ప్లాన్ పత్రాలతో మా ఇంటికొచ్చారు. బి-28 నంబర్‌లోని 2,077 చదరపు గజాల విస్తీర్ణం గల ప్లాటును నా కుమార్తె బ్రాహ్మణి పేరు మీద బుక్ చేయాలని చెప్పా. చదరపు గజం రూ. 5,000కు ఇవ్వజూపారు. 

2007 ఫిబ్రవరి 7న ఎమ్మార్ పేరు మీద రూ.లక్ష చెక్కు, రూ.9,38,500 చెక్కులు, స్టైలిష్ హోమ్స్ పేరు మీద రూ. 2,33,122 ను మరో చెక్కు ఇచ్చా. 2,440 చదరపు గజాలున్న బి-19, బి-20 ప్లాట్లు కేటాయించినట్లు ఎమ్మార్ నుంచి 2008 ఆగస్టులో మాకు సమాచారం అందింది. దానికి ఎమ్మార్‌కు రూ1,05,51,500 చెల్లించాలని చెప్పారు. ఆ మేరకు రూ.1,05,55,085ను డీడీ ద్వారా చెల్లించా. 2010 మార్చిలో స్టైలిష్ హోమ్స్ పేరు మీద రూ. 2,98,141, రూ. 11,030ను రెండు చెక్కుల ద్వారా చెల్లించాం. ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్‌కు రూ. 2,58,915, రూ. 2,37,500 రెండు చెక్కుల ద్వారా చెల్లించాం. స్థలంలో భవన నిర్మాణానికి ఏపీఐఐసీ నుంచి ఇంకా బిల్డింగ్ ప్లాన్ అనుమతి పొందలేదు.’’

చైర్మన్ కాకమునుపే ఒప్పందాలు: అంబటి 
తాను ఏపీఐఐసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించటానికి ముందే ఎమ్మార్‌కు సంబంధించి అన్ని ఒప్పందాలు జరిగిపోయాయని ఏపీఐఐసీ మాజీ చైర్మన్ అంబటి రాంబాబు సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టం చేశారు. తన సోదరుడికి విల్లా కేటాయించాలంటూ తానెవ్వరికీ సిఫారసు చేయలేదని తేల్చిచెప్పారు.
Share this article :

0 comments: