జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది

జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది

Written By news on Friday, March 21, 2014 | 3/21/2014

కిరణ్ కుమార్ పాలనలో అన్ని ధరలూ పెరిగాయి: వినుకొండ జనపథంలో షర్మిలవీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఓ ఒక్క పన్నూ పెరగలేదని, కిరణ్ కుమార్ రెడ్డి పాలనలో అన్నీ ధరలు పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన పెన్షన్లన్నీ కిరణ్ సర్కార్ తొలగించిందని విమర్శించారు. వైఎస్ఆర్ జనపథంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా వినుకొండలో జరిగిన సభలో షర్మిల ప్రసంగించారు.

కిరణ్ పాలనను ప్రతిపక్షనేతగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏనాడు ప్రశ్నించలేదని చెప్పారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై విప్‌ జారి చేసి సర్కార్‌ను కాపాడిన ఘనత చంద్రబాబుదేనని షర్మిల విమర్శించారు. ప్రజారాజ్యం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలను పిచ్చోళ్లను చేసి, కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని షర్మిల ఆరోపించారు. చంద్రబాబు చీకట్లో చిదంబరంను కలిసి కాంగ్రెస్‌కు దాసోహమయ్యారని అన్నారు.

పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబేనని షర్మిల విమర్శించారు. ఎన్టీయార్ పై చెప్పులేయించిన ఘనత కూడా చంద్రబాబుదేనని అన్నారు. ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచన బాబుకు రాలేదని చెప్పారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ ప్రతి పథకాన్ని అమలు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 9ఏళ్లలో రుణమాఫీ చేయాలనే ఆలోచనే చంద్రబాబుకు  రాలేదని, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ దుర్మార్గంగా వీడదీస్తుంటే, విభజనకు మద్దతుగా చంద్రబాబు  లేఖ ఇచ్చారని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని విభజించవద్దంటూ జగనన్న జాతీయ నేతలను కలిసి అభ్యర్థించారని షర్మిల గుర్తుచేశారు. జగనన్న ఆధ్వర్యంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుదామని పిలుపునిచ్చారు. జగనన్నకు ఒక్క అవకాశం ఇస్తే.. మీ సంక్షేమం కోసం జీవితాన్ని ధార పోస్తారని షర్మిల చెప్పారు. జగనన్నను సీఎం చేసుకుని, రాజన్న రాజ్యాన్ని స్థాపిద్దామని షర్మిల కోరారు.
Share this article :

0 comments: