మేకపాటి కుటుంబాన్ని గెలిపించండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేకపాటి కుటుంబాన్ని గెలిపించండి

మేకపాటి కుటుంబాన్ని గెలిపించండి

Written By news on Tuesday, March 18, 2014 | 3/18/2014

మేకపాటి కుటుంబాన్ని గెలిపించండి
 సాక్షి, నెల్లూరు: మహానేత వైఎస్సార్ మరణించినప్పటి నుంచి తమ వెన్నం టి నడుస్తున్న మేకపాటి కుటుంబసభ్యులను వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు వైఎస్సార్‌సీపీ నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారభేరిలో భాగంగా నాలు గు రోజుల జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిల సోమవారం సాయంత్రం ఆత్మకూరులో రోడ్‌షో అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
 
 
 ఎన్నో కష్టనష్టాలను భరించి మేకపాటి కుటుంబం తమ కుటుంబంతో కలిసిమెలసి ఉంటోందన్నారు. ఎన్ని ఆటు పోట్లు వచ్చినా వారు వెరవలేదన్నారు. అటువంటి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత వైఎస్ అభిమానులపై ఉందన్నారు. నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి గౌతమ్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఆత్మకూరును అభివృద్ధి చేసేందుకు మేకపాటి కుటుంబం ఇప్పటికే అనేక ప్రతిపాదన లు సిద్ధం చేసిందన్నారు.
 
 మెట్ట ప్రాంతాలైన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో రెండు లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, వందలాది గ్రామాలకు తా గునీరు అందించే ఉత్తర కాలువ నిర్మాణాన్ని పూర్తిచేయాలనే పట్టుదలతో ఉన్నారన్నారు. ఆత్మకూరు పట్టణంతో పాటు నెల్లూరు పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే వారు కోరారన్నారు.
 
 జగన్ సీఎం అయిన వెంటనే ఆ పనులన్నీ తక్షణమే పూర్తవుతాయని జనం ఈలలు, కేకల మధ్య షర్మిల ప్రకటించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులందరినీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
 విభజనకు వారే కారకులు:
  ఎంపీ మేకపాటి రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. విభజనకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చిన లేఖతోనే తెలుగుజాతి ముక్కలైందన్నారు. వారికి బీజేపీ కూడా సహకరించి దుర్మార్గానికి పాల్పడిందన్నారు. తెలుగుజాతిని చీల్చిన పాపాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు కరువయ్యారన్నారు. సీమాంధ్ర మొత్తం ఆ పార్టీకి ఇదే పరిస్థితి ఉందన్నారు. సీమాంధ్రను సింగపూర్ చేస్తానంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారన్నారు.
 
 తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఆయన అప్పుడెందుకు సింగపూర్ చేయలేదని ప్రశ్నించారు. బాబుపాలనలో ప్రజలు దయనీయ పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. ఆయనను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజధాని సమస్యను తెరపైకి తెచ్చి గొడవలు సృష్టిస్తోందన్నారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతంలో రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారన్నారు. అక్కడ ఫ్లోరైడ్ సమస్య ఎక్కువగా ఉందని, తాగునీరు కూడా సక్రమంగా దొరికే పరిస్థితి లేదన్నారు. కేవలం ప్రభుత్వ భూములు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.
 

 మే 18 లేదా 19న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం

 మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అత్యధిక స్థానాలు భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడం ఖాయమని రాజమోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం మే 18 లేదా 19 తేదీల్లో మంచిరోజు చూసుకుని జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. ఆయన సీఎం అయిన వెంటనే రాష్ట్రంలో వైఎస్ సువర్ణ పాలన తిరిగి ప్రారంభమవుతుందన్నారు.
 
 
 పాదయాత్రతో చరిత్ర సృష్టించిన షర్మిల
 రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన షర్మిల చరిత్ర సృష్టించారని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. ఆమె స్ఫూర్తితోనే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేశారన్నారు. మహానేత వైఎస్సార్ పాలనలో అభివృద్ధి, పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించి మహానేత రుణాన్ని తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి లాంటి నిజాయితీపరులు, త్యాగశీలి లేరన్నారు.  కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Share this article :

0 comments: