వైఎస్సార్ భావాలకు వారసత్వంగా పుట్టిందే వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ భావాలకు వారసత్వంగా పుట్టిందే వైఎస్సార్ సీపీ

వైఎస్సార్ భావాలకు వారసత్వంగా పుట్టిందే వైఎస్సార్ సీపీ

Written By news on Sunday, March 16, 2014 | 3/16/2014

వీడియోకి క్లిక్ చేయండి
హిందూపురం:మహనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి భావాలకు వారసత్వంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందని వైఎస్‌ విజయమ్మ అన్నారు. అనంతపురం జిల్లాలోని హిందుపురంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు మాట్లాడుతూ.. వెనుకబడిన కుటుంబాల అభివృద్ధికి పాటుబడటానికి తమ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు.  ప్రజల సంతోషం కోసం వైఎస్‌ఆర్‌ నిరంతరం తపించేవారని విజయమ్మ అన్నారు. పేద ప్రజల కోసం వైఎస్ఆర్ పడే తపన, ప్రేమ, అభిమానం జగన్‌బాబులో చూస్తున్నానని ఆమె తెలిపారు.  వైఎస్‌ఆర్‌ కలలను, ఆశయాలను జగన్‌ బాబు పూర్తిచేస్తారని, అందుకే తన బిడ్డను ప్రజల చేతుల్లో పెట్టానని చెప్పారు. జగన్‌ బాబును మనం అధికారంలోకి తెచ్చి వైఎస్‌ఆర్‌ స్వర్ణయుగానికి సాధిస్తామని విజయమ్మ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరుపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
 
ఆనాటి చంద్రబాబు పాలనంతా కూడా చీకటి యుగంగానే ఆమె అభివర్ణించారు. ఆయన పాలనలో ప్రజలు వలసలు పోయిన సంగతిని విజయమ్మ గుర్తు చేశారు. రైతులను జైల్లో పెట్టించిన ఘనుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబేనన్నారు. ఆయన పాలనలో ఎక్కువమంది రైతులు చనిపోయారని ఆనాడు శరద్ పవార్ పార్లమెంట్ చెప్పారని విజయమ్మ తెలిపారు. ఏనాడైనా ఆయన ఇచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకున్న పాపాన పోలేదని విమర్శించారు.ఈ రోజు పల్లెల్లో బెల్ట్ షాపులు ఉన్నాయంటే దానికి కారణం బాబు పాలన కాదా?అని ప్రశ్నించారు.2009 నగదు బదిలీ, కోటి వరాలు అంటూ కల్లిబొల్లి మాటలు చెప్పాడని, ఇప్పుడు కూడా తప్పుడు హామీలతో ప్రజల వద్దకు వెళుతున్నాడని విజయమ్మ ఎద్దేవా చేశారు.
300శాతం  ఇన్‌పుట్‌ సబ్సిడీని వైఎస్‌ఆర్‌ ఇచ్చారని, రోడ్డు ప్రమాదం జరిగినా, పొలంలో పురుగోపుట్రో కాటేసినా ఆస్పత్రికి తరలించే పరిస్థితి లేదని వైఎస్ విజయమ్మ  ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో ఆరోగ్యం కోసం పుస్తెలు, పొలాలు అమ్ముకున్న సందర్భాలు చూశామని, అందరికీ ఆరోగ్యం అందాలనే  వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పెట్టారన్నారు.  అందుకే ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని, ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్‌ను చూస్తున్నాని వైఎస్‌  విజయమ్మ తెలిపారు.
 
ప్రజలు తాగునీరు లేక అల్లాడుతుంటే, చంద్రబాబు ఇంకుడు గుంతలు తవ్వుకోమన్నారని,  ఏ వాగ్దానాల మీద టీడీపీ అధికారంలోకి వచ్చిందో వాటిని  చంద్రబాబు తుంగలో తొక్కారని వైఎస్‌ విజయమ్మ విమర్శించారు.  ఒక్క హామీని అమల్లోకి తెచ్చిన పాపానపోలేదని,  చంద్రబాబు 9 ఏళ్లలో రుణమాఫీ  గురించి ఎందుకు ఆలోచించలేక పోయారని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. 
Share this article :

0 comments: