ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ

ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

ఆత్మకూరు అంటేనే భయం: కంటనీరు పెట్టుకున్న విజయమ్మ
కర్నూలు: ఆత్మకూరు అంటేనే చాలా భయమేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు.   వైఎస్ఆర్ కాంగ్రెస్ జనపథంలో భాగంగా  కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఈరోజు  జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజల కోసం ఆ రోజు రాత్రికి తిరిగివస్తానన్న రాజశేఖర రెడ్డి గారు తిరిగిరాని లోకానికి వెళ్లడంతో ఆత్మకూరు అంటేనే భయం కలుగుతోందని కంటనీరు పెట్టుకున్నారు.

ప్రజల కోసం వైఎస్ఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ లతోపాటు వారిని బీసీ ఈలో కలపడంతో వారికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగు గంగ ఇరిగేషన్ వీటి ద్వారా ఈ జిల్లాలో రైతులు రెండు సార్లు పంటలు పండిచుకుంటున్నారని చెప్పారు.  ఆ ఘనత వైఎస్ఆర్ దేనన్నారు.  2006లో సిద్ధాపురం ఇరిగేషన్ కు  వైఎస్ శంకుస్థాపనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.   ఆయన మరణాంతరం ఈ పనులు నిలిచిపోయాయని బాధపడ్డారు. అవి పూర్తికావాలంటే జగన్ అధికారంలోకి రావాల్సిందేనన్నారు.  జగన్ ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. 
Share this article :

0 comments: