టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి

టీడీపీ దాడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

లక్కిరెడ్డిపల్లి: వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో ఓ కార్యకర్త మృతి చెందగా, మరో కార్యకర్త పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలోని గుటకవానిపల్లిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ చెందిన నాయకులు, కార్యర్తలు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.
టీడీపీ చేసిన దాడిలో గంగిరెడ్డి అనే వైఎస్ఆర్ సీపీ కార్యకర్త మృతి అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో మరో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త పరిస్థితి విషమంగా మారడంతో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘర్షణ కారణంగా గుటకవానిపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

http://www.sakshi.com/news/andhra-pradesh/ysr-congress-member-dead-in-lakkireddypalle-of-ysr-district-117690?pfrom=home-latest-story
Share this article :

0 comments: