చంద్రబాబు నయవంచకుడని ఎన్‌టీఆరే అన్నాడు: ఎల్బీ ప్రభాకర్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు నయవంచకుడని ఎన్‌టీఆరే అన్నాడు: ఎల్బీ ప్రభాకర్

చంద్రబాబు నయవంచకుడని ఎన్‌టీఆరే అన్నాడు: ఎల్బీ ప్రభాకర్

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

చంద్రగిరి, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి అణువణువులో విశ్వసనీయత ఉంది,  చంద్రబాబు నాయుడిలో లేనిది ఆ విశ్వసనీయతే అని ఎన్‌టీ రామారావుకు ఆప్తుడు  తుడ మాజీ  చైర్మన్ ఎల్బీ ప్రభాకర్ అన్నారు. పాకాలలో మంగళవారం ‘న్యూస్‌లైన్’తో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఆయన మాటల్లోనే...... కాంగ్రెస్ పార్టీ తరపున చంద్రగిరి ఎమ్మెల్యేగా ప్రచారం చేసేందుకు వచ్చిన బాబును కమ్మ సామాజిక వర్గం అడ్డుకుంది.
 
 నామినేషన్ వేసేందుకు దొడ్డిదారిన వెళ్లాడు.  ఎన్‌టీఆర్ పార్టీ పెట్టాక నాకు  ప్రత్యేక స్థానం ఉండేది. 1995లో టీడీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు తుడ చైర్మన్ పదవి దక్కింది.  నా పదవుల వెనుక బాబు ప్రమేయం లేకపోవడంతో  కుట్ర పన్నాడు. 1994లో చంద్రగిరి నుంచి పోటీ చేసే అవకాశం వచ్చినా అడ్డుపడ్డాడు.  గల్లా అరుణకుమారి 15 ఏళ్లుగా టీడీపీ  క్యాడర్‌ను ఇబ్బందిపెట్టారు. కేసులు, గొడవలు, వర్గాలను  ప్రోత్సహించారు.   గల్లాను తీసుకోవడం బాబు  పెద్ద తప్పిదం. ఆమెను ఎదిరించి నిలబడినవారు అదే వ్యక్తి కోసం ఎలా తలెత్తుకుని పనిచేయాలి.  గల్లా కోసం  నిజమైన టీడీపీ కార్యకర్తలెవరూ పనిచేయరు.
 
 చంద్రబాబు నయవంచకుడని ఎన్‌టీఆరే అన్నాడు
ఎన్‌టీఆర్ మరణం వెనుక చంద్రబాబు అవమానాలే కారణం తప్ప ఇంకొకటి కాదు. ఓ రోజు నన్ను పిలిచి ప్రభాకర్...చంద్రబాబుని  ఏమీ చెయ్యలేమా.  నా బిడ్డల ముందే నన్ను అవమానిస్తున్నాడు అని కంట తడిపెట్టాడు. చంద్రబాబు అతని నీడనుకూడా నమ్మడు. ఎవరైనా ఎదుగుతున్నాడని తెలిస్తే వాడిని రాజకీయంగా అంతం చేసేందుకు ఎంతటికైనా తెగిస్తాడు. పదవిలో ఉంటే ఏ నాటికైనా తమ్ముడు అడ్డు వస్తాడని పిచ్చోడిని చేశాడు. రామ్మూర్తిలో బాబుకన్నా తెలివి తేటలున్నాయి. ఆ తెలివితేటలను గుర్తించిన బాబు సొంత తమ్ముడిని పిచ్చోడిని చేశాడు.
 
దశరథనూ పిచ్చోడిని చేశాడు
డబ్బులకు ఆశపడే గల్లా జయదేవ్‌కు టికెట్టు ఇచ్చాడు. బాబు చేసిన తప్పిదాల వల్లే అరుణకుమారి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు.  గతంలో పేరం హరిబాబుకు టికెట్టు ఆశచూపి ఖర్చు పెట్టించాడు, తరువాత వలపల దశరథనాయుడిదీ అదే పరిస్థితి. సింగిల్ విండో, పంచాయతీ ఎన్నికల్లో గల్లా కుట్రలను ఎదుర్కొని పార్టీని గట్టెక్కించిన వలపల ఎక్కడున్నాడో తెలియకుండా చేశాడు.
 
అభివృద్ధి చేసి చూపిస్తాం  
చెవిరెడ్డిలో నిజారుుతీ, పట్టుదల నచ్చింది. పార్టీ తరఫున నా భార్యను జెడ్పీటీసీ అభ్యర్థిగా నిబెట్టాలని ఆయన అడిగిన వెంటనే ఒప్పుకున్నాను. సర్పం చ్ హోదాలో నా భార్యతో కలిసి స్థాయికి మించి పాకాలను అభివృద్ధి చేశాను. పాకాలలో శాశ్వత తాగునీటికి పరిష్కా రం చూపాను. 2001-05లో 30 కోట్లతో సీసీ రోడ్లువేయించా. ప్రజలు అవకాశ మిస్తే మండలాన్ని అభివృద్ధి చేస్తాను.
Share this article :

0 comments: