అర్ధరాత్రి టీడీపీ అరాచకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అర్ధరాత్రి టీడీపీ అరాచకం

అర్ధరాత్రి టీడీపీ అరాచకం

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

అర్ధరాత్రి టీడీపీ అరాచకం
మదనపల్లె, న్యూస్‌లైన్:  డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలిసి అక్కడికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులపై టీడీపీ వారు దా డులకు పాల్పడ్డారు. విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ ఘటనలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ(45), కార్యకర్త సుబ్రమణ్యం తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఉదయకుమార్, మైనారిటీల నాయకులు బాబ్‌జాన్, భువనేశ్వరి సత్య ప్రభుత్వాస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాల్ రవికుమార్‌ను కోరారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన మదనపల్లెలోని నీరుగట్టుపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

 మున్సిపల్ ఎన్నికల బరిలో 34, 35వ వార్డులకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులుగా రోజారాణి, ఆయన భర్త గౌతం లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. 34వ వార్డులో టీడీపీ అభ్యర్థిగా బండి నాగరాజ పోటీలో ఉన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అయితే వైఎస్సార్ సీపీపై గెలవలేమన్న భయంతో టీ డీపీకి దిక్కు తోచలేదు. దీంతో నీరుగట్టుపల్లెకు చెందిన నాయకుల్ని రంగంలోకి దింపి జోరుగా డబ్బు, మద్యం పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పార్టీ కార్యకర్త బీ.సుబ్రమణ్యం (36)ను వెంటబెట్టుకుని 34వ వార్డుకు కారులో వెళ్లారు. టీడీపీ నాయకుడు శ్రీరాంచినబాబు, ఆయన సోదరుడు యోగేశ్వరబాబు, పెన్నార్ వెంకటేష్, శంకర్ తదితరులు కారులో ఉన్న లక్ష్మీనారాయణ, సుబ్రమణ్యంను చితకబాదారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దాడికి పాల్పడిన వారిపై ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు.
Share this article :

0 comments: