అడుగడుగునా ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అడుగడుగునా ఘన స్వాగతం

అడుగడుగునా ఘన స్వాగతం

Written By news on Monday, March 31, 2014 | 3/31/2014

రోడ్‌షో సక్సెస్
 వేంపల్లె, న్యూస్‌లైన్: వేంపల్లెలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ ఆదివారం చేపట్టిన రోడ్‌షో విజయవంతమైంది. అశేష జన వాహిని తరలి వచ్చారు. విజయమ్మ రోడ్‌షోతో వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆదివారం సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఆమె వేంపల్లెకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు మహమ్మద్ దర్బార్ బాషా ఇంటి వద్ద ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించిన అనంతరం రోడ్‌షో ప్రారంభించారు.
 
 చిన్నారికి నామకరణం :
 
 ఆదివారం వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ వేంపల్లెలో రోడ్‌షో నిర్వహించిన సందర్భంలో కాపు వీధి వద్ద వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు బొమ్మిరెడ్డి ప్రతాప్‌రెడ్డి ఇంటి వద్ద దళితవాడకు చెందిన యల్లప్పగారి కొండయ్య, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడికి జగన్ అని ఆమె  నామకరణం చేశారు.  
 
 అడుగడుగునా ఘన స్వాగతం :
 
 వేంపలెల్లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షోలో ఆమెకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పూలమాల వర్షం కురిపించారు. బాణా సంచా పేల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉరకలేసే ఉత్సాహంతో నాయకులు జోహార్ వైఎస్‌ఆర్.. జై జగన్.. జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
 
  కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ అభ్యర్థి రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి షబ్బీర్‌వల్లి, మాజీ కో.ఆప్షన్ మెంబరు సాదక్‌వల్లి, మాజీ ఎంపీపీ కొండయ్య, మాజీ ఉప సర్పంచ్ రెడ్డయ్య, ఎం.ఎస్.మహమ్మద్ దర్బార్ బాషా, భారతి, మునీర్, షేక్‌షా ఆయా గ్రామాల ఎంపీటీసీల అభ్యర్థులు, మాజీ సర్పంచ్‌లు, సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: