ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే: సీమాంధ్ర కింగ్ జగన్… - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే: సీమాంధ్ర కింగ్ జగన్…

ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే: సీమాంధ్ర కింగ్ జగన్…

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

YS Jaganmohan Reddy

ప్రఖ్యాత టీవీ న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్-నీల్సన్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్ సీపీకి ఎదురులేదని ఆ సర్వే వెల్లడించింది. ఏబీపీ న్యూస్-నీల్సన్ సర్వే ఫలితాలు ఈ రోజు వెల్లడయ్యాయి. వైఎస్ఆర్ సీపీ 17 లోక్ సభ స్థానాలను ఖచ్చితంగా గెలుకుంటుందని, కాంగ్రెస్ 9 స్తానాలను, తెలుగుదేశం పార్టీ 7, టీఆర్ఎస్ 7, ఎంఐఎం 1, ఇతరులు ఒక సీటు గెలిచే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. కాగా తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకి 7 సీట్లు వస్తాయని చెప్పగా, కేసీఆర్ పలు హామీలపై మాటమార్చడం కూడా ఈ పరిస్తితికి దారి తీసి ఉండవచ్చని పరిశీలకుల అంచనా.
టీడీపీ, బీజేపీ, లోక్ సత్తా, జనసేన పార్టీలన్ని కలిసి పోట్టుపెట్టుకున్నా విజయం వైఎస్ఆర్ సీపీదేనని చెప్పడం పార్టీ శ్రేణులు నూతన ఉత్తేజాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జగన్ అవినీతి పరుడని, లక్ష కోట్లు దోచుకున్నాడని, జగన్ కు వోటు వేస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లేనని, అధికార దాహం ఎక్కువని ప్రచారం చేసి ఎన్ని ఎత్తులు వేసినా అవి ప్రజలు నమ్మడం లేదని ఈ సర్వేలతో మరోసారి నిరూపించబదిందని, ఇప్పటికైనా టీడీపీ నాయకులు ప్రజాతీర్పును గౌరవించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు హితవు పలికారు.
ప్రతి సర్వేలో కూడా సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ ‘ఫ్యాన్’ ప్రభంజనంముందు ఇతర పార్టీలు కొట్టుకుపోతాయని స్పష్టం చేస్తుండడంతో ప్రత్యర్థ పార్టీల నేతలు కూడా ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన సర్వేలను కొట్టిపారేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు…రాష్ట్రంలో జరుగుతున్న సర్వేలన్నీ జగన్నాటకమే అని, సర్వే కంపెనీలనూ జగన్ మేనేజ్ చేస్తున్నారని, దోచిన డబ్బుతో అనుకూలంగా సర్వేలు చేయిస్తున్నారని చెబితే, ఇక  గాలి ముద్దుకృష్ణమ నాయుడు అయితే ఏడాదిన్నర జైల్లో ఉన్నవారిని ప్రజలు ఏ విధంగా సమర్దిస్తారని ప్రశ్నిచిన విషయం తెలిసిందే!
http://telugu.hydfirst.com/abp-news-nielsen-survey-predicts-victory-for-jagan-in-seemandhra/
Share this article :

0 comments: