తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. తెలంగాణ ప్రాంతంలో జరిగే తొలిదశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. 17 లోక్ సభ, 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారమే మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ ఈనెల 9 వరకు కొనసాగుతుంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈ సందర్భంగా నామినేషన్‌ కేంద్రాల వద్ద ఆంక్షలు విధించారు. కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధిలో మొత్తం మూడు వాహనాలకే అనుమతి ఇస్తారు. అభ్యర్థి సహా మరో ఐదుగురికి మాత్రమే లోనికి ప్రవేశం ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న నామినేష్లను తిరస్కరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ స్పష్టం చేశారు. స్వదేశంతో పాటు విదేశాల్లో కూడా అభ్యర్థులకు ఏవైనా ఆస్తులు ఉంటే వాటిని కూడా నామినేషన్ల సందర్భంగా వెల్లడించాలని భన్వర్‌లాల్‌ తెలిపారు.
Share this article :

0 comments: