అభిమానం ఉప్పొంగింది. ఉత్సాహం ఉరకలేసింద - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » అభిమానం ఉప్పొంగింది. ఉత్సాహం ఉరకలేసింద

అభిమానం ఉప్పొంగింది. ఉత్సాహం ఉరకలేసింద

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

బహ్మరథం
అభిమానం ఉప్పొంగింది. ఉత్సాహం ఉరకలేసింది. ఆత్మీయత వెల్లువెత్తింది. అన్ని వర్గాల ప్రజలు జననేతను అక్కున చేర్చుకున్నారు. అభిమాన నేతను చూసేందుకు మండుటెండలో గంటల తరబడి నిరీక్షించారు. మహిళలు హారతులు పట్టి, పూలమాలలతో స్వాగతం
పలికారు. వృద్ధులు ఆప్యాయంగా పలకరించారు. విజయనగరం జిల్లాలో జరుగుతున్న ‘వైఎస్సార్ జనభేరి’ నాలుగో రోజూ విజయవంతంగా సాగింది. మంగళవారం బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించారు. ప్రజలు
 ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
 విజయనగరం
 
 నువ్వు గెలుస్తావు నాయనా...
 (బొబ్బిలి రోడ్‌లో గ్రోత్‌సెంటర్ సమీపంలో)
 జగన్ : ఏమ్మా క్షేమంగా ఉన్నారా...
 గేదెల సన్యాసమ్మ : మేము బాగున్నాం నాయనా..నువ్వు క్షేమంగా ఉండాల. నువ్వు గెలవాలి నాయనా..
 (నుదుట బొట్టుపెట్టి ఆశీర్వచనం పలికింది)
 సన్యాసమ్మ: చిలకల పేరంటాలు తల్లి సత్యం గల తల్లి. అమ్మ నిన్ను చల్లగా చూస్తుంది. నువ్వు గెలుస్తావు నాయనా...
 జగన్: మీ అందరి ఆశీర్వాదమే నా బలం తల్లీ..
 
Share this article :

0 comments: