సైకిల్ కు ఓటేయాలంటూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సైకిల్ కు ఓటేయాలంటూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు

సైకిల్ కు ఓటేయాలంటూ కాంగ్రెస్ నేతల బెదిరింపులు

Written By news on Sunday, March 30, 2014 | 3/30/2014

చిత్తూరు: తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య ఫిక్సింగ్ భాగోతం మరోసారి బయటపడింది. గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు పరస్పరం సహకరించుకున్న ఇరు పార్టీలు మునిసిపల్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల అదే పంథాలో నడుస్తున్నాయి. చిత్తూరు జిల్లా నగరిలో టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ఏకమయ్యారు. టీడీపీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ కాంగ్రెస్ నేతలు ఓటర్లను బెదిరించారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకోవడంతో కాంగ్రెస్, టీడీపీ నేతలు వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జ్ చేశారు. వైఎస్ఆర్ సీపీ నాయకురాలు రోజా, కాంగ్రెస్ నేత చెంగారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అనుచర వర్గాలు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Share this article :

0 comments: