తీవ్ర నిరాశలో చంద్రబాబు: కొణతాల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తీవ్ర నిరాశలో చంద్రబాబు: కొణతాల

తీవ్ర నిరాశలో చంద్రబాబు: కొణతాల

Written By news on Saturday, April 7, 2012 | 4/07/2012

తెలుగుదేశం పార్టీ విధానాల్లో స్థిరత్వం లోపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ అన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పూటకో మాట మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఏ విధానాలతో ప్రజల ముందు వెళతారో స్పష్టం చేయాలన్నారు. తీవ్ర నిరాశలో ఉన్న చంద్రబాబు వ్యక్తిగత విమర్శలతో స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. బాబు భూ పోరాటం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ హయాంలో బడాబాబులకు కట్టబెట్టిన భూముల మాటేంటని కొణతాల సూటిగా ప్రశ్నించారు. ముందు ఈ భూముల్లో జెండాలు పాతి పోరాటం చేయాలన్నారు.
Share this article :

0 comments: