సీఎం, బొత్సల మధ్య వివాదంతో శ్రీనివాసరెడ్డిపై వేటు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీఎం, బొత్సల మధ్య వివాదంతో శ్రీనివాసరెడ్డిపై వేటు

సీఎం, బొత్సల మధ్య వివాదంతో శ్రీనివాసరెడ్డిపై వేటు

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అదనపు డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డిపై ప్రభుత్వం బదిలీవేటు వేసింది. మద్యం సిం డికేట్ ముడుపుల వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) చీఫ్‌గా వ్యవహరిస్తున్న శ్రీనివాసరెడ్డిని అప్రధానమైన తీరప్రాంత భద్రత ఐజీగా పంపింది. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదీ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. 

మద్యం ముడుపుల కుంభకోణం వ్యవహారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి, పీసీసీ అధ్యక్షుడు బొత్సల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తనను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి ఏసీబీ చేత దాడులు చేయిస్తున్నారంటూ బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంట్లో భాగంగా బొత్స డిమాండ్‌పై మద్యం ముడుపుల కేసు దర్యాప్తు బాధ్యతలను నిర్వహిస్తున్న ఏసీబీ అదనపు డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిపై మొట్టమొదటిగా వేటు పడింది. 

బదిలీ వ్యవహారం వివాదాస్పదం కాకుండా ఐపీఎస్‌లకు హడావిడిగా పదోన్నతులు కల్పించారు. డీఐజీగా ఉన్న శ్రీనివాసరెడ్డిని ఐజీగా పదోన్నతి కల్పించి అంతగా ప్రాధాన్యత లేని కోస్టల్ సెక్యూరిటీకి పంపారు. శ్రీనివాసరెడ్డితోపాటు 1994 బ్యాచ్‌కి చెందిన డీఐజీలు ఎ.రవిశంకర్ అయ్యన్నార్, ఎన్.బాలసుబ్రహ్మణ్యం, కృపానంద త్రిపాఠి ఉజాలా, బి.శివధర్‌రెడ్డి, సౌమ్యమిశ్రా, శిఖాగోయల్, బీఎల్ సుజాతరావులకు ఐజీగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారిలో నలుగుర్ని బదిలీచేశారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా అంబటి శివనారాయణను నియమించారు.
Share this article :

0 comments: