తీరంలో.. సమరనాదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తీరంలో.. సమరనాదం

తీరంలో.. సమరనాదం

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

చారిత్రక ప్రసిద్ధమైన మొగల్తూరు మరో చారిత్రక పోరాటానికి వేదికైంది. విద్యుత్ చార్జీల పెంపుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా అశేష జనవాహిని సమక్షంలో మొగల్తూరులో విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై సమరనాదం మోగించారు. విద్యుత్ చార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపిన ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఉప ఎన్నికల్లో తీర్పునివ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
అనంతరం అన్ని సామాజికవర్గాల కష్టసుఖాలను తెలుసుకుంటూ .. మతసామరస్యాన్ని పల్లవిస్తూ.. కొత్త సమీకరణాలకు తెరతీస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపుతూ.. తీరంలో ఎల్లలు దాటిన ప్రజాభిమానాన్ని సొంతం చేసుకుంటూ.. ఒక్కడిగా వచ్చి అందరినీ పలకరిస్తూ.. జననేత ముందుకు సాగారు. రెండోరోజైన మంగళవారం సుమారు 25 కిలోమీటర్ల మేర 15 ప్రాంతాల్లో దాదాపు 13 గంటలపాటు ఆయన నిర్వహించిన రోడ్‌షోకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 

మొగల్తూరు, న్యూస్‌లైన్ : రాజకీయం.. అధికారం రెండు కళ్లుగా భావిస్తున్న టీడీపీ, కాంగ్రెస్ నేతలకు చెంప పెట్టుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నర్సాపురం నియోజకవర్గ పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి జిల్లాలోని నర్సాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుట్టిన ఆయన జనం సమస్యలపై పోరాటానికి సైతం మడమతిప్పేది లేదంటూ.. మరోమారు రుజువు చేశారు. మంగళవారం ఉదయం అంగజాలపాలెంలోని అందే భుజంగరావు నివాసం నుంచి ఆయన పలు ప్రాంతాల్లో రోడ్‌షో నిర్వహిస్తూ మొగల్తూరు కోట సెంటరులోని విద్యుత్తు సబ్‌స్టేషన్ వద్ద ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన కేవలం దానికే పరిమితం కాకుండా అచ్చమైన ప్రజానాయకుడిగా విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రత్యక్ష ఆందోళనకు దిగడం ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది.

దాదాపు 2 గంటలపాటు నిర్వహించిన ధర్నాలో విద్యుత్ చార్జీలను తరచూ పెంచుతున్న కాంగ్రెస్, టీడీపీల చర్యలను తప్పుపట్టారు. అనంతరం పర్యటనలో భాగంగా మోడిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ చేసి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు. పేరుపాలెంలో కొబ్బరి వలుపు కార్మికులను కలిసి వారి పరిస్థితులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడంతో వారు సొంత మనిిషిని కలిశామన్న సంతృప్తితో కష్టాలను వెళ్లబోసుకున్నారు. లైన్‌పల్లవపాలెం, ఏటిమొండి ప్రాంతాల్లో మత్స్యకారులను కలిసి వారి జీవనస్థితిని ఆరా తీశారు. ప్రాణాలను పణంగా పెట్టి వేటకు వెళ్లినా పూట గడవడం కష్టమవుతుందంటూ మత్స్యకారులు ఆయన వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పేరుపాలెం నార్త్ పంచాయతీ పరిధిలోని కొత్తకాయలతిప్పలో క్రైస్తవ ఫాదర్ల ఆశీస్సులు పొందిన జగన్‌మోహన్‌రెడ్డి మొగల్తూరులో ముస్లిం మత పెద ్దల దీవెనలు అందుకున్నారు. పేరుపాలెం నార్త్ పం చాయతీలోని కటికలవారిమెరకలో ము త్యాలమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. రోడ్‌షో ముగింపు సందర్భంగా ముత్యాలపల్లిలో బండి ముత్యాలమ్మను దర్శించుకున్నారు. ఇలా క్రైస్తవ, ముస్లిం, హిందూ మనోభావాలను గౌరవిస్తూ.. మతసామరస్యానికి పెద్ద పీట వేస్తూ.. ఆయన పర్యటన సాగింది.

చిరు సొంత గడ్డలో జగన్‌కు జనాదరణ
ప్రజారాజ్యం పార్టీని మూసేసి కాంగ్రెస్ గూటికి చేరిన మెగాస్టార్ చిరంజీవి సొంత గడ్డ అయిన మొగల్తూరులో సైతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ జనాదరణ కనిపించింది. నర్సాపురం నియోజకవర్గంలో దాదాపు 8 పర్యాయాలు పర్యటించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గత ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయి. పుట్టిన ఊరికి చిల్లి గవ్వ కూడా సాయం చేయని పెద్ద మనిషి సొంత పార్టీ పెట్టి ఎవర్ని ఉద్ధరిస్తారని అప్పట్లో వైఎస్ చేసిన వ్యాఖ్యలు బహుళ ప్రచారాన్ని పొందాయి. ఓదార్పు యాత్రలో తొలిసారిగా నర్సాపురంలో పర్యటించిన జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల సందర్భంగా మరోమారు పర్యటించిన సందర్భంలో చిరు సొంత గడ్డలోనే ఆయనకు విశేష స్పందన లభించడం గమనార్హం. ఇదే సమయంలో చిరంజీవిని పార్టీ పెట్టమని తానే చెప్పానంటూ గతంలో ప్రకటించిన మాజీ ఎంపీ చేగొండి హరరామజోగయ్య సైతం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో పాల్గొనడం ఒక విశేషమైతే.. అసమర్థుడి నాయకత్వంలో పనిచేయడం కంటే ఇంటికే పరిమితం కావాలనుకున్నానని చిరంజీవిపై పరోక్ష విమర్శలు చేయడం మరో విశేషం. రాష్ట్రానికి జగన్‌మోహన్‌రెడ్డే సరైన, సమర్థుడైన నాయకుడని ఈ సందర్భంగా జోగయ్య ప్రకటించడం గమనార్హం.

రెండో రోజూ అదే జోరు..
నర్సాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన రెండోరోజూ అదే జోరుగా సాగింది. రైతు కోసం.. పేదల సంక్షేమం కోసం పదవీ త్యాగం చేసిన ముదునూరి ప్రసాదరాజును అఖండ మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీలకు కనువిప్పు కలిగించాలంటూ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రసంగాలు జనాదరణ పొందుతున్నాయి. పర్యటనలో నర్సాపురం నియోజకవర్గానికి చెందిన అట్టడుగుస్థాయి కార్యకర్త నుంచి జిల్లా నాయకుల వరకు జగన్‌మోహన్‌రెడ్డిని అనుసరిస్తున్నారు. ఆయన వెంట జిల్లా పార్టీ కన్వీనర్ కొయ్యే మోషేనురాజు, జిల్లా పార్టీ ఇన్‌చార్జ్ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పాతపాటి సర్రాజు, మోచర్ల జోహార్‌వతి, మాజీ మంత్రులు చేగొండి హరిరామజోగయ్య, ఇందుకూరి రామకృష్ణంరాజు, నాయకులు వేగిరాజు రామకృష్ణంరాజు, డీఎస్‌ఎస్ ప్రసాదరావు, పీడీ రాజు, దాట్ల అన్నపూర్ణ, పి.అశోక్‌గౌడ్, ఊదరగొండి చంద్రమౌళి, విడివాడ రామచంద్రరావు, మైలా వీర్రాజు, గుమ్మాపు ప్రసాదరావు, బీవీ రమణ, వంగలపూడి ఏషయ్య, కావలి వెంకటరత్నంనాయుడు (నాని), దేవత హైమావతి, తలారి వెంకట్రావు, కారుమంచి రమేష్, జక్కంశెట్టి బ్రదర్స్, కోడే యుగంధర్, కౌరు సర్వేశ్వరరావు, పాలంకి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్‌కే రాజు రెండోరోజు పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. 
గోపాలపురం నియోజకవర్గానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలను తలారి వెంకట్రావు, కారుమంచి రమేష్‌లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించారు.

కోట వంశీయులచే ైవె ఎస్సార్ విగ్రహం ఏర్పాటు
పార్టీ నాయకుడి ఇంట్లో జగన్ రాత్రి బస మొగల్తూరు కోట వంశీయులు, పార్టీ అభిమానులచే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. కోట వంశీయులైన కలిదిండి గోపాలకృష్ణంరాజు బహుదూర్, వేణుబాబుబహుదూర్, వైఎస్సార్ అభిమానులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు పర్యటనను ముగించుకుని ముత్యాలపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొపనాతి పల్లయ్య ఇంట్లో రాత్రి బస చేశారు.
Share this article :

0 comments: