వైఎస్సార్‌సీపీ సూపర్‌హిట్ పార్టీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ సూపర్‌హిట్ పార్టీ

వైఎస్సార్‌సీపీ సూపర్‌హిట్ పార్టీ

Written By news on Monday, August 20, 2012 | 8/20/2012

వైఎస్సార్‌సీపీ ఒక సూపర్, డూపర్ హిట్ సినిమా అని, కాంగ్రెస్, టీడీపీలు రెండూ ఫ్లాప్ సినిమాలని సినీ నటుడు గిరిబాబు పేర్కొన్నారు. పార్టీ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో సినీ, టీవీ కళాకారులు, సాంకేతిక నిపుణుల సమావేశం ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఇందులో గిరిబాబు మాట్లాడుతూ.. జగన్‌పై దుష్ర్పచారం చేయడమనే ఏకసూత్ర ప్రణాళికతో టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఊరూరా తిరుగుతున్నారని, కానీ వారి మాటల్ని జనం విశ్వసించడం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల వద్దకెళ్లి.. వైఎస్ జీవించి ఉన్నపుడు అమలైన పథకాలేమిటి? ఇపుడు వాటిని ఎలా నాశనం చేస్తున్నారు? అని కళాకారులు చెప్పాలని ఆయన సూచించారు. సినీ రంగం నుంచి ఇంకా చాలామంది పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జగన్ తిరుగులేని నాయకుడని, ఆయన ప్రజల వద్దకు వెళుతున్నారనే దుగ్ధతోనే జైలులో పెట్టారని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ విజయచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను జగన్‌ను జైలులో ఉండగా చూడలేనని, అందుకే కలిసే యత్నం చేయలేదన్నారు. 

వైఎస్సార్ మరణం తరువాత రాష్ట్రంలో సమర్థులైన నాయకులు కొరవడ్డారని, ఆ లోటును పూడ్చడం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ద్వారానే సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అభిప్రాయపడ్డారు. వైఎస్ అసంపూర్తిగా వదలి వెళ్లిన పథకాల అమలు ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. ఓదార్పు యాత్రలో జగన్ వెంట తిరిగాను కనుకే ఈ విషయం చెప్పగలుగుతున్నానన్నారు. ‘‘తన తండ్రి మరణించాక రెండున్నరేళ్లుగా జగన్ గ్రామాల్లో తిరుగుతూ, ప్రజల మధ్యనే ఉంటూ వారి పేదరికాన్ని దగ్గరగా చూశారు. తాను అధికారంలోకొస్తే వారందరి సమస్యలు తీర్చాలన్న తపన ఆయనకుంది’’ అని వివరించారు. ఒక స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగన్‌కు సినీ, టీవీ రంగంవారు మద్దతు నివ్వడం హర్షణీయమన్నారు. వంగపండు ఉష అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి సినీ హీరో రాజా, వైభవ్, డిజిటల్ ఫిల్మ్స్ ఫోరం ఫర్ ఇండియా చైర్మన్ పి.సి.ఆదిత్య, టీవీ సంఘాల ఫెడరేషన్ నేత కూరపరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వారు రవికుమార్, చిన్నికృష్ణ, శశిధర్, పార్టీ సీఈసీ సభ్యుడు రాజ్‌సింగ్ ఠాకూర్‌తోసహా పలువురు పాల్గొన్నారు.
Share this article :

0 comments: