బషీర్‌బాగ్ గుర్తుందా బాబూ?28 ఆగస్టు, 2000 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బషీర్‌బాగ్ గుర్తుందా బాబూ?28 ఆగస్టు, 2000

బషీర్‌బాగ్ గుర్తుందా బాబూ?28 ఆగస్టు, 2000

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

సీఎంగా కరెంటు చార్జీలు పెంచిన ఘనుడు
తగ్గించాలన్నందుకు జనాన్ని చావబాదించాడు
మహిళలపైనా లాఠీచార్జి, అమానుషత్వం
బషీర్‌బాగ్‌లో కాల్పులకు ముగ్గురి బలి
వందలాది మందికి తీవ్రగాయాలు

కరెంటు చార్జీల పెంపును నిరసిస్తూ అర్జెంటుగా ధర్నాకు దిగి తీరతానంటూ తెగ ఉత్సాహపడుతున్న నారా చంద్రబాబూ గారూ! ఒక్క క్షణమాగి, పై ఫొటోను కాస్త ఓపికగా చూడండి! మీ పాత పాతకాలన్నీ తెరలు తెరలుగా గుర్తు రావడం లేదూ!? అప్పట్లో తమరు పాల్పడ్డ ఘాతుకం కళ్లెదుట నిలిచి నిలదీయడం లేదూ?! పెంచిన కరెంటు చార్జీలను తగ్గించాలంటూ ఆందోళనకు దిగిన అభాగ్యులను పట్టపగలు, రాజధాని నడిబొడ్డులో కరకు తూటాలతో మీరు నిలువెల్లా తూట్లు పొడిచిన తీరుకు నిలువెత్తు సాక్షిగా నిలిచి, ముగ్గురిని పరమ కిరాతకంగా పొట్టన పెట్టుకున్న మీ క్రూరత్వాన్ని ప్రపంచం ముందు బట్టబయలు చేసిన ఈ ఫొటోకు ఏం బదులు చెబుతారు? ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులకు ఆర్థిక సాయమైనా చేయకపోగా.. వారిని అసాంఘిక శక్తులుగా, నేరచరితులుగా చిత్రించజూసిన మీ క్రిమినల్ నైజాన్ని రాష్ట్ర ప్రజలంతా మర్చిపోయారనే అనుకుంటున్నారా? అసలిప్పుడు ఏ ముఖం పెట్టుకుని కరెంటు చార్జీల పెంపుపై ధర్నాకు దిగుతున్నావంటూ జనం ముక్తకంఠంతో సంధిస్తున్న ప్రశ్నకు మీ దగ్గర సమాధానముందా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: అది 2000 సంవత్సరం. ఆగస్టు 28. బషీర్‌బాగ్‌లోని నిజాం కాలేజీ చౌరాస్తా అంతా అట్టుడుకుతోంది. కరెంటు చార్జీలను పెంచుతూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయంపై నిలువెల్లా రగిలిపోతున్న సామాన్యులు అక్కడ వేలాదిగా గుమిగూడారు. పెంపుకు నిరసనగా కాంగ్రెస్, వాపమక్షాల పిలుపు మేరకు అసెంబ్లీ ముట్టడికి వారంతా రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చారు. ఇందిరా పార్కు నుంచి ధర్నాగా కదిలి వచ్చారు. వేలమంది పోలీసులనూ దాటుకుంటూ అసెంబ్లీకేసి దారి తీశారు. అంతే..! ఆ సమయానికి సభలోనే ఉన్న నారా బాబులోని లోపలి మనిషి బయటికొచ్చారు. ఆందోళనకారులపై పోలీసులను ఉసిగొల్పాడు. వాటర్ క్యానన్లు ప్రయోగించి, ఇనుప కంచెలపై పడేసి, గుర్రాలతో తొక్కించి, మహిళలని కూడా చూడకుండా బట్టలూడేలా చితక్కొట్టించి, లాఠీలతో తలలు పగలగొట్టించి క్రూరత్వమంతా ప్రదర్శించుకున్నారు. అయినా కసి తీరక జనంపైకి విచ్చలవిడిగా కాల్పులు జరిపించారు. మూడు నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకుని, వందలాది మందిని తీవ్రంగా గాయపరిచి రక్తదాహం తీర్చుకున్నారు! అలాంటి చంద్రబాబు, ఇప్పుడు విపక్ష నేతగా కరెంటు చార్జీల పెంపుపై బుధవారం నుంచి ధర్నాలు చేస్తాననడం తో టీడీపీ శ్రేణులు కూడా ముక్కున వేలేసుకుంటున్నాయి..!

పరిహారానికీ ససేమిరా అన్నారు...

కరెంటు చార్జీలు పెంచుతున్నట్టు 2000లో విజయవాడ టీడీపీ మహానాడులో నాటి విద్యుత్ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించగానే కలకలం మొదలైంది. విపక్షాలన్నీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. అసెంబ్లీలో చర్చించినా పెంపు రద్దుకు బాబు ససేమిరా అనడంతో ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు వామపక్షాలు ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. అసెంబ్లీలోనే వైఎస్ నిరవధిక దీక్ష ప్రారంభించారు. అయినా టీడీపీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో 2000 ఆగస్టు 28న చలో అసెంబ్లీకి కాంగ్రెస్, వామపక్షాలు పిలుపునిచ్చాయి. దాన్ని కాస్తా బాబు తన రక్తపిపాసతో హింసాత్మకంగా మార్చారు. అసెంబ్లీ ముట్టడికి వస్తున్న వారిలో రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు ఉన్నారంటూ పకడ్బందీగా ముందస్తు ప్రచారానికి తెర తీశారు. ఒక్కొక్కరిపైకి పదేసి మంది పోలీసులను ఉసిగొల్పి విచక్షణారహితంగా కొట్టించారు. చివరికి కాల్పులకూ తెగబడ్డారు. దాంతో కాంగ్రెస్ కార్యకర్త బాలస్వామి (గుంటూరు), సీపీఎం కార్యకర్తలు విష్ణువర్ధన్‌రెడ్డి (రంగారెడ్డి), రామకృష్ణ (ఖమ్మం) దుర్మరణం పాలయ్యారు. 

దీన్ని కూడా తనకు అనుకూలంగా వక్రీకరించుకునేందుకు చివరిదాకా ప్రయత్నించారు బాబు. సొంత మంత్రులు, ఎమ్మెల్యేలనూ తప్పుదోవ పట్టించజూశారు. మృతులు నేరచరితులంటూ మర్నాడు ఏకంగా శాసనసభకే తప్పుడు సమాచారమివ్వగా వైఎస్ దాన్ని తిప్పికొట్టారు. చివరికి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయానికి, క్షతగాత్రులకు వైద్య ఖర్చులకు కూడా బాబు మొండిచేయి చూపితే.. కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలే చందాలు వేసుకుని సాయమందించారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక మృతుల కుటుంబాలకు ప్రభుత్వపరంగా ఆర్ధిక సాయం ప్రకటించడమే గాక ఇంటికొకరికి ఉద్యోగం కల్పించారు. అమరులకు నివాళిగా బషీర్‌బాగ్ చౌరస్తాలో స్తూపం నిర్మించారు. బాబు దాష్టికాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, వామపక్ష నేతలు, కార్యకర్తలు నాటినుంచి ఏటా అక్కడ నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం వైఎస్ మరణం తరువాత అటువైపు కన్నెత్తి చూడటం కూడా మానేశారు!


ఇదీ బాబు బాగోతం
బాబు తొమ్మిదేళ్ల పాలనలో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పైగా ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థ జెన్‌కోను తీవ్ర నష్టాలపాలు చేశారు. దాన్ని మూడు ముక్కలు చేసి నాశనం చేశారు. వైఎస్సేమో అధికారంలోకి వచ్చాక జెన్‌కోను లాభాల బాట పట్టించారు. దాని ఆధ్వర్యంలో పలు భారీ విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వీటిలో చాలావరకు పూర్తయ్యాయి.

తొమ్మిదేళ్లలో ఏకంగా ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచిన ఘనత బాబు సొంతం! 2000లో వ్యవసాయంపై ఏకంగా 61 శాతం పెంచారు. గృహ వినియోగదారులపై 54 శాతం, స్థానిక సంస్థలపై 108 శాతం చొప్పున బాదారు. వైఎస్ హయాంలో ఒక్కసారీ పెంచకపోగా, పరిశ్రమలకు చార్జీలను తగ్గించారు. కానీ ఆయన మరణానంతరం గత మూడేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు చార్జీల పెంపుతో, దొడ్డిదారి ‘సర్దుబాట్ల’ సాకుతో జనం నడ్డి విరిచింది.
ప్రైవేట్ విద్యుదుత్పత్తి కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చడం కోసం కృత్రిమంగా కరెంటు సంక్షోభం సృష్టించారు చంద్రబాబు. ప్రైవేటు కంపెనీలతో అడ్డగోలుగా పీపీఏలు కుదుర్చుకున్న ఫలితంగా ఖజానాపై ఏకంగా రూ.3,000 కోట్ల భారం పడింది.

కేజీ బేసిన్లో అపార చమురు, సహజవాయువు నిల్వలను రాష్ట్ర అవసరాలకు తీర్చుకునేందుకు బాబు సర్కా రు చేసింది శూన్యం. గుజరాత్ మాదిరిగా నూతన అన్వేషణ వెలికితీత విధానం (నెల్ప్)లో బిడ్డింగ్‌లో పాల్గొనకపోవడం ద్వారా రియలన్స్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించారు. వైఎస్ మాత్రం ఏపీజీఏసీని ఏర్పాటు చేసి, బిడ్డింగ్‌లో పాల్గొని రాష్ట్రానికి 4 బ్లాకులు సాధించారు.
Share this article :

0 comments: