తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

Written By ysrcongress on Friday, January 13, 2012 | 1/13/2012

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఆత్మహత్యలు

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకమే కారణం. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో రైతుల పరిస్థితి ఎంతో మెరుగుపడింది, వ్యవసాయం ఆశాజనకంగా ఉండేది. వైఎస్ ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్రంలో 134 లక్షల టన్నుల ధాన్యం ఉత ్పత్తులుంటే, ఆయన సీఎం అయ్యాక 220 లక్షల టన్నులకు ఉత్పత్తులు పెరిగాయి. కానీ మహానేత మరణం తరువాత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పండించిన పంటల పరిస్థితి ఇలా ఉంటే... తినడానికి సరైన తిండిలేకపోవడంతో దేశంలో 42 శాతం పిల్లలు పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లేకపోయిందని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించారు. దీన్నిబట్టి దేశంలో, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో స్పష్టమవుతోంది. వైఎస్సార్ నాటి స్వర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం. రైతుల పక్షాన అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తున్న జగన్ చరిత్ర సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి.
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ

రైతు దీక్షతో ప్రభుత్వానికి హెచ్చరిక

రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజులపాటు అకుంఠిత దీక్ష చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక పంపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం నిద్ర వీడడం లేదు. అందుకే జగన్ రైతుల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొమ్మిదేళ్ల హయాంలో రైతుల జీవితాలతో చెలగాటమాడిన చంద్రబాబు చేస్తున్న రైతుపోరును చూసి జనం నవ్వుకుంటున్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించాలని కోరినందుకు ముగ్గురు తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన ఘనత చంద్రబాబుదే. కానీ వైఎస్సార్ అధికారంలోకి రాగానే విద్యుత్ బకాయిలు మాఫీ చేశారు. ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతోపాటు పంటకు గిట్టుబాటు ధర అందించారు. ఆయన తనయుడు జగన్ అధికారంలోకి వస్తేనే రైతుల జీవితాలు బాగు పడతాయి. 
- కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే

తెలంగాణపై జగన్‌కు స్పష్టమైన వైఖరి ఉంది

తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టమైన వైఖరి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి ఏడాది ప్లీనరీలోనే తెలంగాణ ప్రజల మనోభీష్టాన్ని గౌరవిస్తున్నామని చెప్పి, తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలపబోమని స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతం అవలంబిస్తున్న టీడీపీ... తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ తెలంగాణపై స్పష్టమైన వైఖరిని వెల్లడించకుండా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నాయి. జగన్ తెలంగాణకు రావద్దనడానికి ఆ పార్టీలకు సిగ్గుండాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పునాదులు కదిలి పోతాయి. జగన్ రైతుదీక్షకు మద్దతు తెలిపిన వేలాదిమంది రైతులకు కృతజ్ఞతలు.
- బాజిరెడ్డి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ నేత

వైఎస్ హయాంలో ముస్లింలకు న్యాయం

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం లకు న్యాయం జరిగింది. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది వైఎస్సారే. రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చిరంజీవి అరకులో గిరిజనులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తున్నారు. జగన్‌ను ఎదుర్కొనే సత్తా లేక చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకమయ్యారు. కిరణ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌కు చివరి కిరణం. చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. 
- ఎంఏ రెహమాన్, మాజీ ఎమ్మెల్సీ

జగన్‌కు నిమ్మరసం ఇవ్వడం ఆనందంగా ఉంది

ఆర్మూర్, న్యూస్‌లైన్: రైతు సమస్యలపై మూడు రోజులుగా దీక్ష చేసిన రైతు బాంధవుడు వైఎస్ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడం ఆనందం గా ఉందని ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన నక్కల భూమారెడ్డి అనే రైతు సంతోషం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం భూమారెడ్డి తన చేతులతో జగన్‌కు నిమ్మరసం తాగించి రైతుదీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో పథకాలు చేపట్టి రైతులకు మేలు చేశారని, వ్యవసాయ రుణ మాఫీ కింద తనకు ఒక లక్ష రూపాయలు మాఫీ అయినట్లు గుర్తుచేసుకున్నారు. కరెంటు బకాయిలు కూడా మాఫీ అయ్యాయని చెప్పారు. మూడ్రోజులుగా దీక్ష ప్రాంగణంలోనే ఉన్నానన్నారు.
- రైతు నక్కల భూమారెడ్డి స్పందన
Share this article :

0 comments: