వైఎస్ నాకు చాలా సన్నిహితుడు ఆయన హయాంలోనే డిచ్‌పల్లిని అభివృద్ధి చేశా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ నాకు చాలా సన్నిహితుడు ఆయన హయాంలోనే డిచ్‌పల్లిని అభివృద్ధి చేశా

వైఎస్ నాకు చాలా సన్నిహితుడు ఆయన హయాంలోనే డిచ్‌పల్లిని అభివృద్ధి చేశా

Written By ysrcongress on Monday, January 9, 2012 | 1/09/2012

తెలంగాణ ప్రాంత రైతాంగ సమస్యల పరిష్కారానికి ఆర్మూర్‌లో ఈనెల 10, 11,12 తేదీల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టే రైతు దీక్షలో పాల్గొంటానని నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి చెప్పారు. మండల కేంద్రంలో ఆదివారం క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పసుపుధర క్వింటాలుకు రూ. 15 వేల నుంచి రూ. మూడు వేలకు పడిపోయిందని, రైతుల కోసం ఆర్మూర్ ప్రాంతానికి రావాలని ఇటీవల తాను జగన్‌ను కలసి కోరినట్లు తెలిపారు. దీంతో అన్నదాతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు రైతు సమస్యలపై నిరాహార దీక్ష చేపడతానని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన మాటమేరకు జగన్ చేపడుతున్న దీక్షకు తన మద్దతు ఉంటుందన్నారు. తాను ఏపార్టీలో లేకున్నా, రైతులకోసం జగన్ చేపడుతున్న రైతుదీక్షలో పాల్గొంటానని చెప్పారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు మంచి సన్నిహితుడని, తాను డిచ్‌పల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ అండతోనే రూ. 30 కోట్ల అభివృద్ధి పనులు చేశానని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ యూనివర్సిటీని డిచ్‌పల్లిలో ఏర్పాటు చేశామని తెలిపారు. రామడుగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు రూ. 19. 80 కోట్లు వైఎస్ మంజూరు చేయగా, ఆయన చేతుల మీదుగానే శంకుస్థాపన చేయించానని చెప్పారు. కేసీఆర్‌ది టికెట్లు అమ్ముకునే సంస్కృతని దుయ్యబట్టారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ టికెట్‌ను రూ. 2.50 కోట్ల అమ్ముకున్నాడని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నట్లు జగన్ ప్లీనరీలోనే ప్రకటించాని గుర్తుచేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నానని, తెలంగాణ ప్రకటన ఢిల్లీనుంచి రావాలని స్పష్టంగా చెప్పారన్నారు. తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఇంత స్పష్టంగా మాట్లాడలేదని విమర్శించారు.
Share this article :

0 comments: