సర్కారును నిలదీసేందుకు సిద్ధమైన కర్షక లోకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సర్కారును నిలదీసేందుకు సిద్ధమైన కర్షక లోకం

సర్కారును నిలదీసేందుకు సిద్ధమైన కర్షక లోకం

Written By ysrcongress on Tuesday, January 10, 2012 | 1/10/2012

ఎన్నాళ్లీ కష్టాల సాగు... కన్నీటి గోడు...
సర్కారును నిలదీసేందుకు సిద్ధమైన కర్షక లోకం
నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో నేటి నుంచి 3 రోజులు దీక్ష

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎలా ఉంటుందో.. రైతు ఏడ్చిన రాజ్యం అలాగే ఉంటుంది! రాష్ట్రంలో ఇప్పుడు అన్నదాత శోకం.. సాగుపై సర్కారు నిర్లక్ష్యం అచ్చంగా ఈ పరిస్థితులనే తలపిస్తున్నాయి!! పచ్చని పొలాలు, పాడి పంటలతో అలరారుతూ సిరులొలికించాల్సిన అన్నపూర్ణ రాష్ట్రంలో కుబేరుడిగా వెలిగిపోవాల్సిన రైతు కుచేలుడిగా మారిపోతున్నాడు!! ఏరువాక సాగింది మొదలు ఆరుగాల కష్టాన్ని అమ్ముకునేదాక అడుగడుగునా కడగండ్లే.. వరి, పత్తి, మిరప, చెరకు, పసుపు.. ఏ పంట చూసినా, ఏ రైతును కదిలించినా కన్నీటి వెతలే!! అటు ప్రకృతి కరువు.. ఇటు సర్కారు తెచ్చిపెట్టిన ‘కృత్రిమ’ కరువు.. రెండూ రైతన్నను నిండా ముంచాయి. వ్యవసాయంపై ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్నీతి, దుర్విధానాలను ఎండగడుతూ అన్నదాత ‘క్రాప్ హాలిడే’తో సత్యాగ్రహాన్ని ప్రకటించినా.. కన్నబిడ్డలా చూసుకుంటున్న పంటకు కడుపుమండి నిప్పుపెట్టి నిరసన తెలిపినా పాలకుల్లో ఉలుకు లేదు.. రైతు బతుకులో వెలుగు లేదు! ఒక్కరు ఇద్దరు కాదు గడచిన ఏడాది కాలంలో వందలాది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. పురుగుల మందే పెరుగన్నంలా చేసుకుని తనువులు చాలించారు. కష్టాల సాగు చేయలేక రైతన్న కాడి కింద పడేయడంతో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆహారధాన్యాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. వచ్చిన కాస్తోకూస్తో పంటను అమ్ముకుందామనుకున్నా గిట్టుబాటు ధర రాని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపై ఎన్ని రకాలుగా పోరాడినా చలనం లేకపోవడంతో రైతన్న రణన్నినాదానికి సిద్ధమయ్యాడు. రైతు వ్యతిరేక విధానాలే ఎజెండాగా ముందుకు కదులుతున్న సర్కారును నిలదీసేందుకు, రైతన్నకు గొంతుక అయ్యేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. ఇందులో భాగంగా నేటి నుంచి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో మూడ్రోజులపాటు దీక్ష చేసేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో రైతు లోకం సిద్ధమైంది.
Share this article :

0 comments: