మా చావులు చూడాల్సి వస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మా చావులు చూడాల్సి వస్తుంది

మా చావులు చూడాల్సి వస్తుంది

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012

రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో భవిష్యత్తులో బీఈడీ విద్యార్థుల ఆత్మహత్యలు చూడాల్సిన దుస్థితి వస్తుందంటూ పలువురు బీఈడీ విద్యార్థులు, నిరుద్యోగులు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ డివిజన్‌లో బీఈడీ చదివిన విద్యార్థులు, ప్రియదర్శిని బీఈడీ కళాశాల విద్యార్థులు బుధవారం జగన్‌ను కలిశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇప్పుడు అందకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని విద్యార్థుల పక్షాన నిలిచి ఫీజు పోరు చేపట్టిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న విధానంతో డీఎస్సీలో బీఈడీ విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో ఉపాధ్యాయ పోస్టులలో అధిక మొత్తం డీఎడ్ విద్యార్థులకు కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయంతో ప్రతిభ ఉన్నా బీఈడీ విద్యార్థులు నష్టపోతున్నామన్నారు. డీఎస్సీలో బీఈడీ విద్యార్థులు 70 మార్కులు సాధించినా ఉద్యోగం రావడం లేదన్నారు. కానీ డీఎడ్ విద్యార్థులకు ఏడు మార్కులు వచ్చినా ఉద్యోగం లభించే పరిస్థితులున్నాయన్నారు. బీఈడీలో పాస్ అయినప్పటికీ టెట్ పేరుతో మరో అర్హత పరీక్ష పెట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని వాపోయారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యల తరహాలో భవిష్యత్తులో బీఈడీ విద్యార్థులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. సమస్య పరిష్కార మార్గాలను అన్వేషించి బీఈడీ విద్యార్థులకు ప్రభుత్వం న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి వారికి ధైర్యం చెప్పారు.
Share this article :

0 comments: