విజయమ్మ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

విజయమ్మ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

Written By ysrcongress on Saturday, January 14, 2012 | 1/14/2012

అనారోగ్య కారణంతో వాయిదా కోరిన పిటిషనర్ తరఫు న్యాయవాది

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినామీల అక్రమాస్తుల కేసుల నిష్పాక్షిక విచారణ నిమిత్తం రాష్ట్రం నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడింది. విజయమ్మ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో బాధపడుతున్నందున విచారణను వాయిదా వేయాలన్న పిటిషనర్ తరఫు మరో న్యాయవాది అభ్యర్థనకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. చంద్రబాబు ఆయన బినామీలు ‘నాట్ బిఫోర్’ల ద్వారా విచారణపై అనుమానాలు రేకెత్తిస్తున్నారని, తమకు కావాల్సిన బెంచ్‌ల కోసం ‘నాట్ బిఫోర్’ను వాడుకుంటున్నారని, ఈ పరిస్థితుల్లో కేసును మరో హైకోర్టుకు బదిలీ చేయాలంటూ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కు బదలాయించాలని ఈ నెల 5న జస్టిస్ దల్వీర్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. 

దీంతో విజయమ్మ పిటిషన్ జస్టిస్ బీఎస్ చౌహాన్, టీఎస్ ఠాకూర్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషన్‌పై శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే విజయమ్మ తరఫు న్యాయవాది లేచి.. కేసును వాదిస్తున్న సీనియర్ న్యాయవాది అనారోగ్యంతో ఉన్నందున కేసును నాలుగు వారాలపాటు వాయిదా వేయాలని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకారం తెలుపకపోవడంతో కనీసం వచ్చే శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలోనే రిలయన్స్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లేచి, న్యాయస్థానాలపై నమ్మకం లేదన్న తరహాలో పిటిషనర్‌లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ కేసు పూర్వాపరాలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాదనలు విని రిజర్వ్‌లో పెట్టాక ట్రాన్స్‌ఫర్ కోరడం సరికాదన్నారు.
Share this article :

0 comments: