విజయసాయిరెడ్డిని జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతో హడావుడిగా చార్జిషీట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయసాయిరెడ్డిని జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతో హడావుడిగా చార్జిషీట్

విజయసాయిరెడ్డిని జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతో హడావుడిగా చార్జిషీట్

Written By ysrcongress on Sunday, April 1, 2012 | 4/01/2012

కోర్టుకు 263 అనుబంధ డాక్యుమెంట్లు సమర్పణ
13 మంది నిందితులు.. 66 మంది సాక్షులు
జగన్‌పై ఐపీసీ 120 బీ, ఏమాత్రం వర్తించని 
అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు
విజయసాయిరెడ్డిని జైల్లోనే ఉంచాలన్న ఉద్దేశంతో హడావుడిగా చార్జిషీట్
తోచిన రీతిలో భాష్యం... లాభాపేక్షతో పెట్టిన పెట్టుబడులను
క్విడ్ ప్రో కోగా చూపే యత్నం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ శనివారం ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ (అభియోగపత్రం) దాఖలు చేసింది. సీబీఐ ఎస్పీ హెచ్.వెంకటేష్ నేతృత్వంలో రెండు ట్రంకు పెట్టెల్లో 68 పేజీల చార్జిషీట్‌ను, దాన్ని తయారు చేసేందుకు ఆధారమైన 263 అనుబంధ డాక్యుమెంట్లను తీసుకువచ్చిన సీబీఐ అధికారులు వాటిని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి బి.నాగమారుతి శర్మకు అందజేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డిలతోపాటు ఆరుగురు వ్యక్తులు, ఐదు కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు. 66 మందిని సాక్షులుగా పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా అనుబంధ చార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. సాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపించుకునేందుకు వీలుగా తమకు చార్జిషీట్ ప్రతిని ఇవ్వాలని సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి కోరడంతో, న్యాయమూర్తి అందుకు అంగీకరిస్తూ మెమో దాఖలు చేస్తే ఇస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా అశోక్‌రెడ్డి మెమో దాఖలు చేయడంతో చార్జిషీట్ ప్రతిని అందజేశారు. మరోవైపు సాయిరెడ్డి రిమాండ్ ముగియడంతో ఆయన్ను కోర్టులో హాజరుపర్చారు. అనంతరం సాయిరెడ్డి రిమాండ్‌ను కోర్టు ఈనెల 13 వరకు పొడిగించింది.
తేల్చిందేమీ లేదు..

జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఏడు నెలల 20 రోజుల పాటు హడావుడిగా, ఆర్భాటంగా దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులు.. అత్యంత కీలకమైన చార్జిషీట్ దాఖలు సమయానికి ఏమీ తేల్చలేకపోయారు. ఈ కేసులో మొదటి నిందితునిగా పేర్కొన్న జగన్‌మోహన్‌రెడ్డిపై కేవలం ఐపీసీ సెక్షన్ 120 బి, ఆయనకు ఏ మాత్రం వర్తించని అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) సెక్షన్ 11, 13(2), 13(1)(డి)ల కింద మాత్రమే అభియోగాలు మోపారు. అవినీతి నిరోధక చట్టం కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు మాత్రమే వర్తిస్తుంది. వాస్తవానికి ఈ నేరం జరిగిందని చెబుతున్న కాలానికి అంటే 2006 సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ప్రతినిధిగా లేరు. 2009లో ఆయన పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. కాబట్టి ఈ సెక్షన్ కింద నమోదు చేసిన అభియోగం చట్ట ప్రకారం నిలిచేది కాదు. ఈ మొత్తం వ్యవహారంలో జగనే ప్రధాన సూత్రధారి అంటూ ఆయనను ప్రధాన నిందితునిగా పేర్కొన్న సీబీఐ అధికారులు... చివరకు ఆయన పాత్ర గురించి వివరించాల్సిన సమయంలో మాత్రం చేతులెత్తేశారు. జగన్ అలా చేయించారు.. ఇలా చేయించారు అంటూ తోక పత్రికలకు ఉద్దేశపూర్వక లీకులు ఇచ్చి, జగన్, రాజశేఖరరెడ్డిలను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న సీబీఐ అధికారులు, చార్జ్‌షీట్ దాఖలు సమయంలో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. అరబిందో, హెటిరో కంపెనీలకు భూములు కేటాయించడంలో కుట్ర పన్నారన్న సీబీఐ అధికారులు... అందులో జగన్‌ను ప్రత్యక్షంగా తప్పుపట్టేందుకు ధైర్యం చేయలేకపోయారు. తన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని అరబిందో, హెటిరో కంపెనీలను జగన్ ప్రభావితం చేయలేదని పరోక్షంగా అంగీకరించారు. తద్వారా ఇందుకు సంబంధించి గతంలో పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలన్నీ అవాస్తవాలేనని తేలిపోయింది. 

సాయిరెడ్డి బయటకు రావొద్దన్నదే అసలు ఉద్దేశం..

అదే విధంగా క్విడ్ ప్రో క్వో పెట్టుబడులను నిరూపించలేకపోయిన సీబీఐ అధికారులు.. ఈ చార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా ఓ విషయంలో తమ లక్ష్యాన్ని మాత్రం నెరవేర్చుకున్నారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి అరెస్టయి 90 రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో.. ఆయన ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటకు రాకూడదన్న ఉద్దేశంతో ఆగమేఘాలపై చార్జిషీట్ దాఖలు చేసి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు (క్విడ్ ప్రో క్వో) పెట్టారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు.. ఆ ఆరోపణలు నిజమని నమ్మించేందుకు పడిన కష్టం చార్జ్‌షీట్‌లో స్పష్టంగా కనిపించింది.

దివంగత నేత వైఎస్‌పై విషం...

ప్రతిపక్షాలు విషం కక్కినట్లు, సీబీఐ కూడా యథావిధిగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై విషం కక్కింది. అవసరం లేకపోయినా సందర్భాన్ని సృష్టించి మరీ వైఎస్ గురించి చార్జిషీట్‌లో ప్రస్తావించింది. జనం మధ్య లేని వ్యక్తికి అవినీతిని ఆపాదించింది. ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎప్పుడూ భూ కేటాయింపులు జరపనట్లు, వైఎస్ మాత్రమే భూ కేటాయింపులు జరిపారన్న రీతిలో మొత్తం వ్యవహారాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. చార్జిషీట్ మొత్తం అరబిందో, హెటిరో గ్రూపు కంపెనీలకు జరిపిన భూ కేటాయింపులకే పరిమితమైంది. భూ కేటాయింపులు జరిపే విషయంలో గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాలకు అనుగుణంగానే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూడా ఈ రెండు కంపెనీలకు భూములు కేటాయిస్తే.. అక్కడేదో కుట్ర జరిగినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేసింది సీబీఐ. 

ఏపీఐఐసీ కింది స్థాయి అధికారులతోపాటు రెండు కంపెనీల కిందిస్థాయి అధికారులు చేసిన తప్పిదాలను ప్రభుత్వ తప్పిదాలుగా చూపేందుకు సీబీఐ పడరాని పాట్లు పడింది. అంతేకాక లాభాపేక్షతో పెట్టిన పెట్టుబడులను క్విడ్ ప్రో క్వో పెట్టుబడులుగా చూపించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడింది. దర్యాప్తులో తేలిన విషయాల పేరుతో, ప్రతీ విషయానికి సొంత భాష్యం చెప్పే ప్రయత్నం చేసింది. భూ కేటాయింపు విషయంలో వైఎస్ గురించి, జగన్ కంపెనీల్లో పెట్టుబడుల విషయంలో విజయసాయిరెడ్డి పేరును వీలైనన్ని చోట్ల జగన్‌తో కలిపి ప్రస్తావించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. పరిశ్రమల అభివృద్ధిలో భాగంగా అరబిందో, హెటిరో కంపెనీలకు భూములు కేటాయిస్తే, అందులో కుట్ర కోణముందంటూ వక్రభాష్యం చెప్పింది.

సీఎం స్థాయి వ్యక్తి జోనల్ మేనేజర్‌తో కుమ్మక్కయ్యారట!

జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి, బీపీ ఆచార్య, ఏపీఐఐసీ పటాన్‌చెరు జోనల్ మేనేజర్‌లు కలిసి కుమ్మక్కై.. ఏపీఐఐసీని మోసం చేసేందుకు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సీబీఐ తన చేతికి తోచింది రాసేసింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఓ జోనల్ మేనేజర్ స్థాయి వ్యక్తితో కలిసి కుట్రపన్నే అవసరముందా అన్న మౌలిక ప్రశ్న ప్రజల్లో ఉత్పన్నమవుతున్న స్పృహ కూడా లేకుండా మహానేతపై బురద చల్లేందుకు ప్రయత్నించింది. అంతేకాక భూముల కేటాయింపునకు సంబంధించి అరబిందోకు అనుకూలంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ చెప్పారంటూ ఓ కింది స్థాయి ఉద్యోగి తమకు చెప్పారంటూ రాజశేఖరరెడ్డికి అవినీతి ఆపాదించేందుకు యత్నించింది. ఇదే విషయంలో ఏమాత్రం సంబంధం లేకపోయినా విజయసాయిరెడ్డి పేరును కూడా పలుచోట్ల ప్రస్తావించింది.

అసలు రంగు బయటపడిందిలా..

జగన్ గ్రూపు కంపెనీల్లో హెటిరో ఫార్మా మొత్తం రూ. 19.50 కోట్లు క్విడ్ ప్రో క్వో రూపంలో పెట్టుబడులు పెట్టారని, ఇందులో రూ.15 కోట్లు జననీ ఇన్‌ఫ్రాలో, రూ.4.50 కోట్లు జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడిగా పెట్టారని సీబీఐ తెలిపింది. ఇదంతా లాభాపేక్షతో చేసిన లావాదేవీలైతే... సీబీఐ వీటిని యథావిధిగా క్విడ్ ప్రో క్వో పెట్టుబడులని చెప్పింది. జగతి పబ్లికేషన్స్ వాటా ప్రీమియం విలువ రూ.350ను అధిక ప్రీమియంగా సీబీఐ అభివర్ణించింది. అంత ప్రీమియంతో జగతి పబ్లికేషన్స్‌లో వాటాలు కొనడం అదేదో అసాధారణమన్నట్లు భాష్యం చెప్పింది. వాస్తవానికి జగతి పబ్లికేషన్స్ ఎన్నడూ కూడా తమ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని ఎవ్వరినీ బలవంతం చేయలేదు. రూ.350 ప్రీమియం విషయంలో మార్కెట్‌లో సంప్రదింపులు జరిపిన తర్వాతే లాభసాటి అనుకుంటేనే పెట్టుబడి పెట్టాలని పెట్టుబడుదారులకు జగతి రాతపూర్వకంగా స్పష్టం చేసింది. అయినా లాభాపేక్ష ఆధారంగానే పెట్టుబడులు పెట్టారు. 

అయితే ఈ పెట్టుబడులకు సీబీఐ మాత్రం తనదైన శైలిలో క్విడ్ ప్రో క్వో భాష్యం చెబుతోంది. అరబిందో, హెటిరో కంపెనీలకు భూములు కేటాయించడం వల్ల ఏపీఐఐసీకి పెద్ద మొత్తంలో నష్టం కలిగిందని సీబీఐ అధికారులు తేల్చారు. వాస్తవానికి ఈ రెండు కంపెనీల వల్ల ఏపీఐఐసీకి కలిగిన నష్టం కంటే ఎక్కువ మొత్తాన్ని జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టాయి. క్విడ్ ప్రో క్వో కింద పెట్టుబడి పెట్టి ఉంటే ఎంత మొత్తం మేర భూములు పొందారో అదే మొత్తం పెట్టుబడిగా పెట్టి ఉండాలి. కానీ ఈ రెండు కంపెనీలు అంత కంటే ఎక్కువ మొత్తాలనే పెట్టుబడిగా పెట్టాయంటే జగన్ గ్రూపు కంపెనీల నుంచి లాభాన్ని ఆశించే ఓ పెట్టుబడిదారునిగా పెట్టుబడి పెట్టాయని ఇట్టే అర్థమవుతోంది. కానీ ఈ విషయం సీబీఐకి మాత్రం అర్థం కావడం లేదు. దాని ఆలోచన విధానమంతా రాజకీయ కోణంలోనే తిరుగుతోంది. వైఎస్, జగన్ ప్రతిష్టలను మంటగలపడమే లక్ష్యంగా ఇన్నాళ్లూ దర్యాప్తు సాగించి.. చివరకు చార్జిషీట్ దాఖలు సమయంలో సీబీఐ అసలు రంగు బయటపడిపోయింది.

జగన్ కేసులో నిందితులు... (13 మంది)

1. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, (పూర్వ చైర్మన్, జగతి పబ్లికేషన్స్).
2. వి.విజయసాయిరెడ్డి, (చార్టెడ్ అకౌంటెంట్, ఫౌండర్ డెరైక్టర్, జగతి పబ్లికేషన్స్).
3. అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
4. హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్.
5. ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్ ప్రైవేట్ లిమిటెడ్.
6. ఎం. శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, హెటిరో డ్రగ్స్.
7. కె.నిత్యానందరెడ్డి, ఎండీ, అరబిందో ఫార్మా.
8. పి.శరత్‌చంద్రారెడ్డి, పూర్వ ఎండీ, ట్రిడెంట్ లైఫ్ సెన్సైస్.
9. బీపీ.ఆచార్య, పూర్వ వైస్ చైర్మన్, ఏపీఐఐసీ.
10. యద్దనపూడి విజయలక్ష్మీప్రసాద్, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ.
11. పీఎసీ.చంద్రమౌళి, కంపెనీ సెక్రటరీ, అరబిందో ఫార్మా.
12. జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
13. జనని ఇన్‌ఫ్రా లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్.

గంపగుత్తగా అందరిపై పెట్టిన సెక్షన్లు....

120 (బి) (నేరపూరితకుట్ర)
420 (మోసం)
409 (నమ్మకద్రోహం)
477 (ఎ) (అకౌంట్ల తారుమారు)
అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు-1988)లోని సెక్షన్లు 13 (2)(ప్రభుత్వ ప్రతినిధి హోదాలో ముడుపులు స్వీకరించడం), 13(1-సీడీ)(అక్రమ ఆస్తులు కూడబెట్టడం)
నిందితులపై పెట్టిన సెక్షన్లు...

1. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, 120(బి), పీసీ యాక్టులోని సెక్షన్ 11, 13(2) రెడ్‌విత్ 13(1)(డి).
2. వి.విజయసాయిరెడ్డి, 120(బి) రెడ్‌విత్ 420, 409, 468 (ఫోర్జరీ).
3. ఎం.శ్రీనివాసరెడ్డి, 120(బి), 420.
4. కె.నిత్యానందరెడ్డి, 120(బి) రెడ్‌విత్ 420, 468, 471(నకిలీ పత్రాలను నిజమైనవిగా నమ్మించడం).
5. పి.శరత్‌చంద్రారెడ్డి, 120(బి), 420.
6. బీపీ.ఆచార్య, 120(బి), 409, పీసీ యాక్టు 13(2) రెడ్‌విత్ 13(1)(సి)(డి).
7. యద్దనపూడి విజయలక్ష్మీ ప్రసాద్, 120(బి) రెడ్‌విత్ 420, 13(2) రెడ్‌విత్ 13(1)(డి).
8. పీఎస్ చంద్రమౌళి, కంపెనీ సెక్రటరీ, 120(బి) 420, 468, 471.
సాక్షులు.. (66 మంది)

1. అన్నదానం వెంకటరామకృష్ణ-సీజీఎం (అసెట్స్ మేనేజ్‌మెంట్), ఏపీఐఐసీ.
2. చల్లా సుబ్బారావు, సీజీఎం (ఫైనాన్స్-రిటైర్డ్), ఏపీఐఐసీ.
3. టీఎల్ రామచంద్రన్, సీజీఎం (ప్రాజెక్ట్స్-రిటైర్డ్), ఏపీఐఐసీ.
4. కల్లా ప్రభాకర్‌రావు, జీఎం (ప్రాజెక్ట్స్-రిటైర్డ్), ఏపీఐఐసీ.
5. బండ రామకృష్ణశర్మ, జీఎం, (ప్రాజెక్ట్స్-రిటైర్డ్), ఏపీఐఐసీ.
6. డి.మురళీధర్‌రెడ్డి, డెరైక్టర్ ఆఫ్ పోర్ట్స్, బీచ్‌రోడ్, కాకినాడ.
7. డి.పార్థసారథిరావు, సీఈ, ఏపీఐఐసీ.
8. మందల దశరథరామిరెడ్డి, జోనల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ.
9. రంగినేని చెంచయ్య, సీజీఎం, ఏపీఐఐసీ.
10. బి.సునీతాబాయి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ.
11. హరీస్ సుధాకర్ డేవిడ్, సీజీఎం (రిటైర్డ్), ఏపీఐఐసీ.
12. భోగాది రాఘవరావు, డిప్యూటీ జోనల్ మేనేజర్ (రిటైర్డ్), ఏపీఐఐసీ.
13. డి.గీతాంజలి, జోనల్ మేనేజర్, ఏపీఐఐసీ.
14. సాంబశివరావు, జీఎం (అసెట్స్ మేనేజ్‌మెంట్), ఏపీఐఐసీ.
15. బి.సుధాకర్, సీజీఎం (ఫైనాన్స్), ఏపీఐఐసీ.
16. కె.సురేంద్రబాబు, డీజీఎం (ఫైనాన్స్), ఏపీఐఐసీ.
17. ఎం.శ్రీకాంత్‌రెడ్డి, మేనేజర్ (అసెట్స్ మేనేజ్‌మెంట్), ఏపీఐఐసీ.
18. కేవీ రంగారావు, వైస్‌ప్రెసిడెంట్, అరబిందో ఫార్మా.
19. కేజే వెంకటరామిరెడ్డి, సీనియర్ మేనేజర్, అరబిందోఫార్మా.
20. కె.నాగరాజు, సీఏ, నాగార్జున అసోసియేట్స్.
21. కేకే శాస్త్రి, డీజీఎం (లీగల్-రిటైర్డ్), అరబిందోఫార్మా.
22. ఎ.మోహనరామిరెడ్డి, జీఎం (లీగల్), అరబిందోఫార్మా.
23. జీవీ శేషయ్య, ఫైనాన్స్ కన్సల్టెంట్, యాక్సిస్ క్లినిక్స్.
24. కేవీ భాస్కర్‌రెడ్డి, జీఎం (ఫైనాన్స్), హెటిరోడ్రగ్స్.
25. కె.రవీంద్రనాథ్‌రెడ్డి, జీఎం (ఫైనాన్స్), హెటిరోల్యాబ్స్.
26. టీవీ సత్యప్రసాద్, వైస్‌ప్రెసిడెంట్, హెటిరో హెల్త్‌కేర్ లిమిటెడ్.
27. పి.శ్రీధరన్, చీఫ్ మేనేజర్, ఓబీసీ.
28. ఆర్‌వీ మహేష్‌కుమార్, మేనేజర్, ఓబీసీ.
29. ఖాలిద్ మహమూద్, బ్రాంచ్ మేనేజర్, ఐసీఐసీఐ.
30. శివలంకశర్మ, అసిస్టెంట్ మేనేజర్, ఐసీఐసీఐ.
31. సంతోష్ మాథూర్, అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్, యాక్సిస్ బ్యాంక్.
32. ఎ.రాజశేఖర్‌రెడ్డి, చీఫ్ మేనేజర్, అలహాబాద్ బ్యాంక్.
33. జేఎం.పట్నాయక్, సీనియర్ మేనేజర్, అలహాబాద్ బ్యాంక్.
34. జి.ప్రభుకిషోర్, ఆఫీసర్, ఎన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఫైనాన్స్ సర్వీస్.
35. ఎన్.అరవింద్‌బషు, మేనేజర్, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్స్.
36. రాజేష్ కె.కులకర్ణి, అసిస్టెంట్ మేనేజర్, ఎస్‌బీహెచ్.
37. అయ్యపు పార్థసారథి, చీఫ్ మేనేజర్, ఎస్‌బీహెచ్.
38. పి.కుమారస్వామి, సీనియర్ మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా.
39. కేవీ ప్రసాదరావు, మేనేజర్, బ్యాంక్ ఆఫ్ ఇండియా.
40. పీవీవీఎస్‌ఎస్ మూర్తి, చీఫ్ మేనేజర్, ఆంధ్రాబ్యాంక్.
41. హెచ్.క్రిష్ణ, అసిస్టెంట్ జీఎం, ఐడీబీఐ.
42. ఎస్‌ఆర్‌వీ జగపతిరాజు, బ్రాంచ్‌హెడ్, ఐఎన్‌జీ బ్యాంక్.
43. ఎ.వెంకటరెడ్డి, ఎండీ, లీఫార్మా.
44. సీపీఎన్ కార్తీక్, కంపెనీ సెక్రటరీ, జగతి పబ్లికేషన్స్.
45. వరలక్ష్మి ఆర్.భాస్కర్, బ్రాంచ్ మేనేజర్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్.
46. పి.నారాయణ్ సుదర్శన్, సీనియర్ డెరైక్టర్, డెలాయిట్.
47. వల్లే ముగేంద్ర మహిధర్, అసిస్టెంట్ కమిషనర్ (ఇన్‌కంట్యాక్స్).
48. జేవీఎన్ సురేష్, అసిస్టెంట్ మేనేజర్, ఆంధ్రా బ్యాంక్.
49. స్వామినాయుడు, కస్టమర్ కేర్ మేనేజర్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్.
50. నర్మదా సంతోషి చింతల, కస్టమర్ కేర్ మేనేజర్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్.
51. కె.అజయ్‌కుమార్‌రెడ్డి, మేనేజర్ (విజిలెన్స్) ఎస్‌బీహెచ్.
52. జి.చంద్రశేఖర్, డీజీఎం, ఎస్‌బీహెచ్.
53. కె.మల్లికార్జున, మేనేజర్, కేవైసీ, ఎస్‌బీహెచ్.
54. పి.ఆనంద్, డిప్యూటీ మేనేజర్, ఎస్‌బీహెచ్.
55. జీఎన్ వెంకటరమణ, ఏవో (ఎంఏసీ), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
56. జె.సురేష్‌చంద్రమోహన్, ఏవో, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
57. డి.సూర్యచంద్రరావు, ఏవో, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ.
58. డి.సుబ్రమణ్యం, ఎస్‌ఎస్‌ఓ, ఎస్‌ఆర్.డెన్.
59. సీహెచ్‌వీవీఎస్ ప్రసాద్, సీజీఎం(ప్రాజెక్ట్స్), ఏపీఐఐసీ.
60. కె.ప్రవీణ్‌కుమార్, డీఎస్‌పీ, సీబీఐ.
61. బి.రాందాస్, ఇన్‌స్పెక్టర్, సీబీఐ.
62. ఎంఎంఏ నందా, ఇన్‌స్పెక్టర్, సీబీఐ.
63. ఎస్‌ఏ వదూద్, ఇన్‌స్పెక్టర్, సీబీఐ.
64. డి.చంద్రశేఖరన్, ఇన్‌స్పెక్టర్, సీబీఐ.
65. వి.శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్, సీబీఐ.
66. హెచ్.వెంకటేష్, ఎస్పీ, సీబీఐ.

పరిణామ క్రమమిదీ.. 

2011 జూలై 12న జగన్ కంపెనీలో పెట్టుబడుల వ్యవహారంపై ప్రాథమిక విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐకి హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశం.
2011 జూలై 26, ఆగస్టు 1న ప్రాథమిక దర్యాప్తు నివేదికలను సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టుకు సమర్పించారు.
దాదాపు 10 రోజులపాటు జస్టిస్ కక్రూ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు వింది.
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో 2011 ఆగష్టు 10న సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.
ఆగస్టు 17న సీబీఐ74 మందిని నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ దాఖలు.
2012 జనవరి 2న రెండో నిందితునిగా ఉన్న విజయసాయిరెడ్డి అరెస్టు.
2012 మార్చి 31న 13 మంది నిందితులపై చార్జిషీట్ దాఖలు.
Share this article :

0 comments: