వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఓదార్పుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఓదార్పుయాత్ర

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఓదార్పుయాత్ర

Written By ysrcongress on Tuesday, January 3, 2012 | 1/03/2012

 కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో విడత ఓదార్పుయాత్ర బుధవారం మేడికొండూరు మండలం పేరేచర్ల నుంచి ప్రారంభం కానుంది. తొలి, మలి విడతల్లో వైఎస్ జగన్ ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించిన విషయం విదితమే. ఈ నెల 4న ఒంగోలులో జరిగే ఫీజుధర్నాలో పాల్గొని అనంతరం రోడ్డుమార్గాన జిల్లాకు చేరుకుంటారు. తొలిరోజు మేడికొండూరు, ఫిరంగిపురం మండలాల్లో పర్యటిస్తారు. పేరేచర్ల, వేములూరిపాడు, అమీనాబాద్, ఫిరంగిపురం, రేపూడి గ్రామాల్లో పర్యటించి మార్గం మధ్యలో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు. 

ఫిరంగిపురంలోని విజయదుర్గా కాలనీలో వైఎస్సార్ ఆకస్మిక మృతిని తట్టుకోలేక మరణించిన మేడా పోతురాజు కుటుంబాన్ని ఓదారుస్తారు. ఈ సందర్భంగా ఫిరంగిపురం మండల కేంద్రంలో జరిగే బహిరంగసభలో జగన్ ప్రసంగించి ఫిరంగిపురంలోనే రాత్రి బస చేస్తారు. 5వ తేదీ ఉదయం మేడికొండూరు మండలం పాలడుగు నుంచి రెండోరోజు యాత్రను ప్రారంభిస్తారు. జగన్ ఓదార్పుయాత్ర నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పార్టీ నేతలతో చర్చించి ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో మొత్తం 44 రోజులపాటు ఎనిమిది నియోజకవర్గాల్లో పర్యటించిన జగన్ 22 కుటుంబాలను ఓదార్చారు. 389 వైఎస్‌ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు. జగన్ పర్యటన నేపథ్యంలో తాడికొండ, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఫీజు ధర్నాకు సమాయత్తం: పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఫీజుధర్నా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించటానికి నేతలు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజ శేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి ఏర్పాట్లపై సమీక్షించారు.



కృష్ణా జిల్లాలో కల్తీ సారా తాగి మృతి చెందిన వారి కుటుంబాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం పరామర్శిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రాష్ట్ర ప్రోగ్రామింగ్ కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. ‘‘జగన్ మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి ఆగిరిపల్లి, శోభనాపురం, గణపవరం అడ్డరోడ్డు, చంద్రాల మీదుగా పోరాటనగర్ వెళతారు. 

పోరాటనగర్, కనిమెర్లతండా, నాగులూరు తండాల్లో మృతుల కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. తర్వాత శోభనాపురం క్రాస్‌రోడ్డు మీదుగా విజయవాడకు చేరుకుంటారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, ఆ తర్వాత ఒంగోలు వెళతారు’’ అని వివరించారు. బుధవారం ఒంగోలులో జరిగే ఫీజు ధర్నాలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నానికి గుంటూరు వద్ద ఉన్న పేరేచర్లకు చేరుకుని ఓదార్పుయాత్రను తిరిగి ప్రారంభిస్తారు.
Share this article :

0 comments: