కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది.

కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది.

Written By ysrcongress on Friday, January 6, 2012 | 1/06/2012

* ఇండియా సిమెంట్‌కు 13 టీఎంసీలు కేటాయించారన్న సీబీఐ
* కేటాయించింది 0.013 టీఎంసీ మాత్రమే
* అది కూడా ప్రభుత్వ విధానంలో భాగంగానే 
* అయినా జల విధానాన్ని ఉల్లంఘించా రంటూ వాదన.. వాటినే వాస్తవాలనే రీతిలో రిపోర్ట్ చేసిన కొన్ని పత్రికలు
* ‘13 టీఎంసీల’ వాదనను ఖండించిన ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్
 దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తప్పిదాలు జరిగినట్టు చూపేందుకు సీబీఐ చేయని ప్రయత్నమంటూ లేదు. అందుకోసం ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చెప్పడానికి, చూపడానికి కూడా వెనకాడటం లేదు! నేరారోపణలను ఎలాగైనా నిజం చేయాలనే రాజకీయ ఉద్దేశాలతో కోర్టును సైతం సీబీఐ తప్పుదోవ పట్టిస్తోంది. ఆ క్రమంలో పచ్చి అబద్ధాలు చెప్పేందుకు కూడా సిద్ధమైంది. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో జరిగిన వాదనలే ఇందుకు నిదర్శనం. పరిశ్రమలకు నీటి కేటాయింపు విధానంలో భాగంగా 2009లో రంగారెడ్డి జిల్లా తాండూరు సమీపంలో ఇండియా సిమెంట్ లిమిటెడ్‌కు కాగ్నా నది నుంచి 13 ఎంసీఎఫ్‌టీ నీటిని కేటాయించారు. 

ఇది ఒక టీఎంసీ కంటే చాలా చాలా తక్కువ. కచ్చితంగా చెప్పాంటే 0.013 టిఎంసీ. కానీ సీబీఐ న్యాయవాది మాత్రం ఆ కంపెనీకి ఏకంగా 13 టీఎంసీలు కేటాయించినట్టు కోర్టులో వాదించారు! పైగా, ఇంత ‘భారీగా’ నీటిని కేటాయించిన ందుకు ప్రతిగానే జగతి పబ్లికేషన్‌లో ఇండియా సిమెంట్ రూ.140 కోట్ల మేర పెట్టుబడి పెట్టిందన్నారు! వాస్తవ కేటాయింపులకు, సీబీఐ ఆరోపిస్తున్న దానికీ అక్షరాలా హస్తిమశకాంతరం ఉంది. పైగా, ఈ నీటి కేటాయింపు ప్రభుత్వ విధానంలో భాగంగానే జరిగింది. అయినా సరే, ఇది అంతర్రాష్ట జల విధానాన్ని ఉల్లంఘిస్తూ జరిగిందని కూడా సదరు న్యాయవాది వాదించారు! కొన్ని పత్రికలు కూడా యథాతథంగా అదే విషయాన్ని రిపోర్ట్ చేశాయి!!

ఇండియా సిమెంట్‌కు నీటి కేటాయింపుపై సీబీఐ వాదనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలు చూసి సాగునీటి అధికారులు అవాక్కయ్యారు. తాము కేటాయించింది కేవలం 0.013 టీఎంసీలు అయితే, సీబీఐ మాత్రం ఏకంగా 13 టిఎంసీలుగా పేర్కొనడం పట్ల విస్మయం వెలిబుచ్చారు. ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ బి.వేణుగోపాల ఆచార్య ఈ మేరకు గురువారం ఒక ఖండన విడుదల చేశారు. సర్కార్ నిబంధనలకు లోబడే ఇండియా సిమెంట్ కంపెనీకి నీటి కేటాయింపు జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదని పేర్కొన్నారు. 

ఈ కేటాయింపు అంతర్రాష్ట జల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనన్న సీబీఐ న్యాయవాది వాదనను కూడా ఇరిగేషన్ అధికారులు ఖండించారు. నదీ జలాల్లో రాష్ట్రానికి కేటాయించిన కోటా నుంచే పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామని, ఇందులో అంతర్రాష్ర్ట జల ఒప్పందాల ఉల్లంఘనలేవీ జరగలేదని స్పష్టం చేశారు! దివంగత నేతకు ఏదోలా నేరం ఆపాదించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారనేందుకు పై ఉదంతం మచ్చుతునక మాత్రమే. కొద్ది నెలలుగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలను పరిశీలించినా, సీబీఐ వ్యవహార శైలిని చూసినా అడుగడుగునా ఈ విషయం స్పష్టమవుతుంది. 

వైఎస్సార్ తప్పిదాలు చేశారని న మ్మించడం, తద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దోషిగా చిత్రించడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ ప్రహసనంలో కొన్ని పత్రికలు కూడా చేయి కలిపి ఇలాంటి వార్తలను వీలైనంతగా ప్రచారం చేస్తున్నాయి! నీటి కేటాయింపులకు ప్రతిగానే జగన్ కంపెనీల్లో ఇండియా సిమెంట్ ఏకంగా రూ.140 కోట్లు పెట్టిందన్న సీబీఐ చేస్తున్న వాదనే నిజమైతే... రాష్ర్టంలో వేలాది కంపెనీలకు గత 40, 50 ఏళ్లుగా నీటిని కేటాయిస్తూనే ఉన్నారు. అలా నీరు పొందిన సంస్థలన్నీ ఇలా ప్రభుత్వ పెద్దలకు కోట్లాది రూపాయలు చెల్లించాలంటే రాష్ట్రంలో అసలు ఒక్క సంస్థ కూడా పరిశ్రమ నెలకొల్పే పరిస్థితే ఉండదు.

ఇదీ విధానం..
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వాలు విద్యుత్, వ్యాట్ రాయితీల వంటివి కల్పిస్తాయి. ఇందుకోసం ప్రతి ఐదేళ్లకోసారి ఏకంగా పారిశ్రామిక విధానాలను కూడా ప్రకటిస్తుంటాయి. చంద్రబాబు హయాంలోనూ పారిశ్రామిక విధానముంది. వైఎస్ అధికారంలోకి వచ్చాక 2005-10కి పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. తర్వాత రోశయ్య హయాంలో 2010-15కు విధానాన్ని తయారుచేశారు. పరిశ్రమను నెలకొల్పేందుకు భూమి, నీటి కేటాయింపులతో పాటు రోడ్ల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

ప్రస్తుతం పరిశ్రమలకు కరెంటుపై యూనిట్‌కు 75 పైసల రాయితీ, స్థాయిని బట్టి 25 నుంచి 50% దాకా వ్యాట్ రాయితీ, పెట్టుబడిపై 20 నుంచి 50 శాతం రాయితీతో పాటు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో కూడా రాయితీ ఇస్తున్నారు. రాష్ట్రంలో కార్ల తయారీ యూనిట్లకైతే ఏకంగా 100 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు కూడా కిరణ్ సర్కారే ముందుకొచ్చింది! రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షే తప్ప, ఫలానా పరిశ్రమకు మేలు చేయడం, అందుకు ప్రతిగా లబ్ధి పొందడం వంటివి పారిశ్రామిక విధానంలో ఉండవు. వైఎస్ హయాంలోనూ అదే జరిగింది. దానికి కూడా సీబీఐ వక్రభాష్యాలు చెబుతోంది. అందుకోసం వాస్తవాలను కూడా ఇష్టానికి వక్రీకరిస్తోంది!
Share this article :

0 comments: