బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌

బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌

Written By ysrcongress on Wednesday, January 4, 2012 | 1/04/2012

బ్యాంకు మారినా పాత అకౌంట్ నంబర్‌ను కొనసాగించే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే మొబైల్ నంబర్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి అమలులోకి వచ్చిన పోర్టబిలిటీ(మార్పిడి) సదుపాయం ఇప్పుడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు కూడా విస్తరించనుంది. ఈ దిశగా కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రయత్నాలను ప్రారంభించింది. ప్రస్తుతం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పోర్టబిలిటీ విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలున్నాయని, వీటిని పరిష్కరించి త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి డి.కె.మిట్టల్ తెలిపారు. 

మంగళవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రితో సమావేశానంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు గుర్తింపు సంఖ్య, ఖాతాదారుని గురించి తెలుసుకో(కేవైసీ), కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్)లను పూర్తిస్థాయిలో అమలు చేస్తే పోర్టబిలిటీ సాధ్యమవుతుందన్నారు. దీనివల్ల కేవైసీ నిబంధనలతో పని లేకుండా పాత అకౌంట్ నంబర్‌తోనే వేరే బ్యాంకుకు మారే అవకాశం అందుబాటులోకి వస్తుందన్నారు.
Share this article :

0 comments: