ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు

ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు

Written By ksr on Tuesday, January 3, 2012 | 1/03/2012

యువత, మహిళల జీవితాలను తెలిసే నాశనం చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు. కనిమెర్లలో కల్తీసారా తాగి మృత్యువాత పడిన వ్యక్తుల కుటుంబాల్ని పరామర్శించిన అనంతరం మీడియాతో జగన్ మాట్లాడారు.

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సువర్ణ పాలనను అందిస్తామన్నారు. త్వరలోనే సువర్ణ యుగం రాబోతుందని.. గ్రామాల్లో బెల్టు షాపులు, మద్యం దుకాణాలు ఉండ కుండా చర్యలు తీసుకుంటామని జగన్ తెలిపారు. ప్రతి వెయి మంది ఉన్న గ్రామానికి 10 మంది మహిళా పోలీసులున్న స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు.

దినమంతా కష్టపడిన వ్యక్తికి ఒక పెగ్గు సారా ఉండాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జగన్ మండిపడ్డారు. ఇంటింటికి పెగ్గు అన్న చంద్రబాబు ఆలోచన తప్పు అన్నారు. ఎక్సైజ్ అధికారులకు ప్రభుత్వం టార్గెట్లను పెడుతోందని ఆయన విమర్శించారు.



పులివెందుల: నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ ఆదేశించారు. ప్రజల సమస్యల్ని విన్న వెంటనే అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని విజయమ్మ సూచించారు. అనంతరం పార్టీ నాయకుడు మహేశ్వరరెడ్డి తయారు చేయించిన క్యాలెండర్‌ను పులివెందుల పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆ తర్వాత కడప యోగి వేమన వర్సిటీ విద్యార్థులు, రూరల్ వాటర్ సప్లై అధికారులు తెచ్చిన న్యూ ఇయర్ కేక్‌ను విజయమ్మ కట్ చేశారు. అధికారులకు, విద్యార్థులకు, నియోజకవర్గ ప్రజలకు విజయమ్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు





హైదరాబాద్: దేశ అత్యున్నత విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఒక వస్తువుగా వాడుకుంటోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ ఆరోపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొణతాల మాట్లాడారు.

భయ భ్రాంతులను చేయడానికే జగతి పబ్లికేషన్స్ ఆడిటర్ విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కేసులో విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని కొణతాల అన్నారు.




హైదరాబాద్: ప్రభుత్వానికి నీతి, నిజాయితీ ఉంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలనీ ఆ వెంటనే తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కొండా మురళి సవాలు చేశారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వద్ద మంగళవారం మీడియాతో మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తాను గతంలో కూడా ఇదే విషయం స్పష్టంగా చెప్పానని ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అన్నారు. ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయడానికి ఉబలాట పడుతున్న కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓట్లేసిన ఎమ్మెల్యేలను అనర్హులుగా చేయడానికి మాత్రం ఆసక్తి చూపడం లేదని ఆయన నవ్వుతూ అన్నారు.

వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాను పోటీ చేసేటపుడు కాంగ్రెస్ పార్టీకి 124 ఓట్లు మాత్రమే ఉండేవనీ అలాంటిది తాను 205 ఓట్లు తెచ్చుకుని నెగ్గాననీ మురళి వివరించారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానంటే అది దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహకారం, తన సొంత పలుకుబడే కారణమని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన దయాదాక్షిణ్యాలపై ఉంది కానీ తాను వారి దయా దాక్షిణ్యాలతో లేనని మురళి ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక రాక్షసి వంటిదనీ చిరంజీవి వంటి వారిని మంత్రి పదవి ఇస్తామని చేర్చుకుని ఆ తరువాత నాన్చుతూ కూర్చుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్మూర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి చేసే దీక్షకు తాను పదివేల మందితో వెళతానని ఆయన తెలిపారు. కొండా సురేఖను గెలిపించడం కోసమే టీఆర్‌ఎస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ చేయడం లేదని బాబు చేసిన విమర్శలను ప్రస్తావించినపుడు బాబు చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిన స్థాయి తమది గానీ, జగన్‌ది కానీ కాదని ఆయన తోసి పుచ్చారు.
Share this article :

0 comments: