‘జగన్ కోసం..’ సంతకాల వెల్లువ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ‘జగన్ కోసం..’ సంతకాల వెల్లువ

‘జగన్ కోసం..’ సంతకాల వెల్లువ

Written By news on Sunday, December 30, 2012 | 12/30/2012

కార్యక్రమానికి విశేష స్పందన

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమ అరెస్టుకు, సీబీఐ పక్షపాత ధోరణికి నిరసనగా ఆ పార్టీ ‘జగన్ కోసం.. జనం సంతకం’ పేరుతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. మహానేత వైఎస్ మరణం, ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ కుట్రలు, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై ఉప ఎన్నికల ముందు హఠాత్తుగా జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయించిన వైనం, ఆ తర్వాత సీబీఐ లీకులు, బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన ప్రతిసారీ అబద్ధపు కథనాల డ్రామాలను ప్రజలకు వివరించి.. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా వారి వద్ద సంతకాలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమం తలపెట్టారు. అయితే ఈ విషయం తెలిసి జనమే స్వచ్ఛందంగా పార్టీ నేతలు, కార్యాలయాల వద్దకు వచ్చి సంతకాలు చేస్తున్నారు. 

తమ కుటుంబీకులను, సన్నిహితులను, స్నేహితులను తీసుకొచ్చి సంతకాలు చేయిస్తున్నారు. రోడ్లపై వైఎస్సార్ కాంగ్రెస్ జెండాతో నేతలెవరైనా కనిపిస్తే వచ్చి.. కోటి సంతకాల గురించి ఆరా తీస్తున్నారు. సంతకాలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఈ కార్యక్రమాన్ని మరింత చేరువ చేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్.. ఇంటర్నెట్‌లో కూడా సంతకాల సేకరణ ప్రారంభించింది. www.ysrcongress.com సైట్‌లో ఈ సంతకాలకు ప్రత్యేకంగా లింక్ ఏర్పాటు చేసింది. ఈ సైట్‌లోకి వెళ్లి ‘జగన్ కోసం.. జనం సంతకం’ లోగో మీద క్లిక్ చేసి తర్వాత అక్కడ ఇచ్చిన సూచనలు అనుసరించడం ద్వారా ప్రజలు సంతకాలు చేయవచ్చు. 

లేదా www.ysrcongress.com/home/koti_santhakaalu.htm లింక్‌ను నేరుగా బ్రౌజర్‌లో ఓపెన్ చేయడం ద్వారా కూడా ఆ సంతకాల పేజీకి చేరుకోవచ్చు. అడుగున ఉండే రెండు ఆప్షన్లలో (1. కోటి సంతకాల ఫామ్ డౌన్‌లోడ్ చేసుకుని సంతకం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయానికి పంపడం, 2. ఆన్‌లైన్‌లో నేరుగా సంతకం చేయడం) ఏదో ఒక దాని ద్వారా సంతకం చేయవచ్చు. జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినమైన డిసెంబర్ 21న మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత.. ఆ పత్రాలను పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలని నిర్ణయించింది.

జననేత కోసం రెహమాన్ నెత్తుటి సంతకం

జననేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహమాన్ జోస్యం చెప్పారు. జగన్ నిర్బంధాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మైనార్టీసెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెహమాన్ తన రక్తంతో సంతకం చేసి సంతకాల సేకరణను ప్రారంభించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ముస్లింలకు ఉన్నత విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం, ఉపకార వేతనాలు ఇప్పించడంతో ప్రస్తుతం ఎందరో మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించారన్నారు. అందువల్ల ఆయన తనయుడైన జగన్‌కు రాష్ట్రంలోని మైనారిటీలు అండగా ఉన్నారన్నారు.
Share this article :

0 comments: