వైఎస్సార్ కాంగ్రెస్.. సంచలన విజయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్.. సంచలన విజయాలు

వైఎస్సార్ కాంగ్రెస్.. సంచలన విజయాలు

Written By news on Monday, December 31, 2012 | 12/31/2012

అధికార, ప్రతిపక్షాలు రెండూ కుమ్మక్కై జనం సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో.. ప్రజాపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపైకి దూసుకొచ్చింది. ప్రజల తరఫున ఈ ఏడాది ఎన్నో పోరాటాలు చేసింది. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తప్పుడు కేసులతో నిర్బంధించినా వెరవకుండా పార్టీ శ్రేణులు, నాయకులు ఆత్మ విశ్వాసంతో ఈ ఏడాది ముందుకు నడిచారు. జగన్‌ను అరెస్టు చేస్తే పార్టీ ఉనికి కోల్పోతుందని కాంగ్రెస్, టీడీపీ పన్నిన పన్నాగాలు తలకిందులయ్యాయి. 

గత ఏడాది డిసెంబర్ 4న రైతులు, వ్యవసాయ కూలీల పక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై జగన్ మద్దతుదారులైన 17 మంది ఎమ్మెల్యేలు ఓట్లేసి అనర్హత వేటుకు గురైనా.. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 15 మంది గెలుపొంది రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ చార్జిషీటులో పెట్టినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా 2.90 లక్షల మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు.

జనం జగన్ వెంట లేరని, ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానం పాలపొంగులాంటిదని సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన నేతలకు ఈ ఫలితాలు దిమ్మ తిరిగేలా చేశాయి. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం శాసనసభలో కూడా బలీయమైన శక్తిగా ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ప్రజా సమస్యలపై అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తూ నిజమైన ప్రతిపక్ష పాత్రను నిర్వహించింది. జగన్ జైలుకు వెళ్లినా బయట ఉన్న విజయమ్మ పార్టీ బాధ్యతలను మోస్తున్నారు. ఆమె చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్లలో చేనేత దీక్ష, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చేయాలని కోరుతూ ఫీజు దీక్షను చేశారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా విజయవాడలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఇలా అన్ని పోరాటాల్లోనూ ఆమె ముందుంటూ, రాష్ట్రమంతటా పర్యటిస్తూ పార్టీ శ్రేణులకు స్ఫూర్తి అందిస్తున్నారు. ద్రోహచింతనతో ఉన్న కాంగ్రెస్, విశ్వసనీయత కోల్పోయిన టీడీపీ వ్యవహార శైలితో బేజారెత్తిన పలువురు ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రముఖ నేతలు.. ఆయా పార్టీలను వీడి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్న సందర్భంగా ఏర్పాటైన సభల్లో కూడా విజయమ్మ పాల్గొంటున్నారు. ఇక ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయలో వైఎస్సార్ సమాధి వద్ద నుంచి అక్టోబర్ 18న ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్రంలో ఒక హైలైట్‌గా నిలిచింది. ఆమె యాత్రలకు జనం విరగబడటాన్ని చూసి ఇతర రాజకీయ పార్టీలు హడలెత్తాయి. రంగారెడ్డి జిల్లాలో ఆమెకు ప్రమాదం సంభవించటంతో తాత్కాలికంగా యాత్రకు అంతరాయం కలిగింది.
Share this article :

0 comments: