మహానేత పథకాలకు తూట్లు: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మహానేత పథకాలకు తూట్లు: విజయమ్మ

మహానేత పథకాలకు తూట్లు: విజయమ్మ

Written By news on Thursday, January 3, 2013 | 1/03/2013 పటాన్‌చెరు:మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పథకాలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. సర్‌చార్జీల పేరుతో పేదలపై భారం మోపుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయ్యింది, మద్యం ఏరులై పారుతుందని ఆమె అన్నారు. కార్మికుల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు కూడా పేదలను ఏనాడు పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు చలవ వల్ల ఆల్విన్‌లాంటి సంస్థలు మూతపడ్డాయని వైఎస్‌ విజయమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న అందరికి పేరుపేరునా స్వాగతం పలికారు. Share this article :

0 comments: